ర‌జ‌నీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. 2020కి గానూ ప్ర‌ముఖ న‌టుడు ర‌జ‌నీకాంత్ కు వ‌రించింది. ఈ మేర‌కు కొద్దిసేప‌టి క్రితం కేంద్ర‌ప్ర‌భుత్వం అధికారిక ప్ర‌క‌ట‌న జారీ చేసింది. భార‌త‌దేశంలోనే కాదు, ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ప్ర‌జాద‌ర‌ణ పొందిన న‌టుల జాబితాలో ర‌జనీ ప్ర‌ధ‌మ స్థానంలో ఉంటాడు. దేశంలో అత్య‌ధిక పారితోషికం అందుకునే హీరోల జాబితాలోనూ త‌న‌దే అగ్ర‌స్థానం. న‌టుడిగా, నిర్మాత‌గా, క‌థ‌కుడిగా… ర‌జ‌నీ చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాల్ని అందుకున్నారు. త‌మిళ చిత్ర‌సీమ‌ని అత్యంత ప్ర‌భావితం చేసిన న‌టుడు.. ర‌జ‌నీ. 70 ఏళ్ల వ‌య‌సులోనూ… అదే జోరు, అదే స్పీడు కొన‌సాగించ‌డం మాట‌లు కాదు.

స్టైల్‌కి నిర్వ‌చ‌నం..

ర‌జ‌నీకాంత్. త‌న పేరు చెబితే చాలు అభిమానుల‌కు పూన‌కాలు వ‌చ్చేస్తాయి. అభిమానుల్ని భ‌క్తులుగా మార్చుకున్న ఘ‌న‌త త‌న‌ది. ఓ సాధార‌ణ వ్య‌క్తి.. సూప‌ర్ స్టార్ గా మార‌డం వెనుక‌… బోలెడంత క‌ష్టం ఉంది. ర‌జ‌నీకాంత్ అంటే.. స్టైల్ ఐకాన్ మాత్ర‌మే కాదు. గొప్ప న‌టుడు కూడా. బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ప్ర‌తీ సినిమా ర‌జ‌నీలోని న‌టుడ్ని 70 ఎం.ఎం.లో చూపించేదే. ద‌ళ‌ప‌తి లాంటి సినిమాల్లో స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌ట‌న‌తో అల‌రించాడు ర‌జ‌నీ. రాజ‌కీయాల్లోకి వ‌స్తా.. వ‌స్తా అంటూ… ఇటీవ‌ల ఊరించి ఊరించి ఉసూరుమ‌నిపించ‌డం ఒక్క‌టే ఆయ‌న అభిమానుల‌కు వెలితి. రాజ‌కీయాల్లోకి రాకుండా ఆయ‌న బీజేపీకి ప‌రోక్షంగా స‌హాయం చేశాడంటూ కొంత‌మంది వాదిస్తుంటారు. ఇప్పుడు దాదా సాహెబ్ వ‌చ్చిన సంద‌ర్భంగా ఆ నోళ్ల‌కు మ‌రింత ప‌ని దొర‌క‌బోతోంది. ఏదేమైనా ఈ అవార్డుకు ర‌జ‌నీ నూటికి నూరు శాతం అర్హుడు. కంగ్రాట్స్ టూ సూప‌ర్ స్టార్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close