బాబాయ్ బాలకృష్ణపై కల్యాణ్‌రామ్ ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చూపిస్తూనేఉన్నాడు. పటాస్‌లో బాలయ్య పాటని రీమిక్స్ చేసి హిట్టు కొట్టాడు. ఇప్పుడు బాలయ్య సూపర్ హిట్ గీతాన్ని టైటిల్‌గా ఎంచుకొన్నాడని సమాచారం. కల్యాణ్ రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో ఇజం అనే సినిమా చేస్తున్నాడు. దీనికి నిర్మాత కూడా కల్యాణ్‌రామే. ఇటీవల జి.నాగేశ్వరరెడ్డి చెప్పిన కథకు కల్యాణ్‌రామ్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఇద బావ మరదళ్ల స్టోరీనట. అత్తని ఆట పట్టించే అల్లుడిగా కల్యాణ్‌రామ్ కనిపిస్తాడని సమాచారం. ఈసినిమాకి ఓక్రేజీ టైటిల్ కూడా పెట్టేశారు… అదే ‘దంచవే మేనత్త కూతురా’.
మంగమ్మగారి మనవడు సినిమాలో బాలయ్య – సుహాసిని పాడుకొన్న అల్లరి పాట ఇది. ఇప్పుడు అదే కల్యాణ్ రామ్ టైటిల్ అయిపోయింది. ఈ సినిమాలో ఆ పాటనీ రీమిక్స్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇజం తరవాత కల్యాణ్ రామ్ చేయబోయే సినిమా ఇదేనని టాక్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఆటాడుకుందాం రా సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నరేష్‌తో ఓ సినిమా చేస్తున్నాడు నాగేశ్వరరెడ్డి. అది పూర్తయ్యాక కల్యాణ్ రామ్ సినిమాపట్టాలెక్కిస్తారు. మరి బాలయ్య పాటని వాడుకొంటున్న కల్యాణ్‌రామ్‌కి మరో సారి సెంటిమెంట్ కలిసొచ్చి.. హిట్టు కొడతాడేమో చూడాలి.