చిన్న చిన్న గ్రామ పంచాయతీలు, వార్డులు.. అంతా వైసీపీ సిట్టింగ్ స్థానాలు,, వాలంటీర్లు ఉన్నారు. పథకాలు ఆపేస్తామనే బెదిరింపులు ఉన్నాయి. పోలీసులు వచ్చారు. ఏకగ్రీవం చేసుకోగలిగినన్ని చేసుకున్నారు. ఎన్నికలు జరిగిన వాటిలో గెలవడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అయినా కంచుకోటల్లాంటి పంచాయతీలు కొట్టుకుపోయాయి. మొత్తం పన్నెండు సిట్టింగ్ గ్రామాల్లో వైసీపీ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోయారు. వార్డు స్థానాల్లో అయితే టీడీపీ అభ్యర్థులే గెలిచారు. ఇన్ని అస్త్రాలు పెట్టుకుని ఓటర్లపై దండెత్తినా ఎందుకు ఓట్లు వేయించుకోలేకపోయారు ?
నిజానికి అవి గ్రామ స్థాయి ఎన్నికలు… వాటిలో ఓట్లు వేసే వారు గ్రామ రాజకీయాల్ని మాత్రమే ఎజెండాగా తీసుకుంటారు. తాము అధికార పార్టీ నేతకు ఓటేయకపోతే.. వేధిస్తారేమో అన్న భయం ఉంటుంది. కానీ చాలా చోట్ల ఓటర్లు అలాంటి భ యాన్ని వదిలి పెట్టారు. అంటే మెల్లగా పరిస్థితి మారుతోందన్నాట. సింగరాయకొండలో పాకల అనే గ్రామ పంచాయతీలో టీడీపీ మద్దతుదారు ఇప్పటి వరకూ గెలవలేదు. ఇప్పుడు గెలిచారు. జనసేన , టీడీపీ గెలిస్తే గోదావరి జిల్లాల్లో ఎలాంటి ప్రభంజనం ఉంటుందో మరోసారి నిరూపితమయింది.
వైసీపీ తమకే అత్యధిక స్థానాలొచ్చాయని సంబరపడవచ్చు కానీ.. చాప కిందకు నీరొచ్చేసిందని స్పష్టమవుతోంది. నిజానికీ ఈ పంచాయతీ ఉపఎన్నికలు తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికి ప్రభుత్వం పెట్టదల్చుకుంటే.. దాదాపుగా పది మున్సిపాలిటీలు.. రాజమండ్రి కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ జరిపించేందుకు వెనుకడుగు వేస్తోంది. ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. ఎన్నికల సమయం వస్తుంది కాబట్టి అసలు ఎన్నికలు పెట్టాలన్న ఉద్దేశంలో లేరు.
ఇప్పటికిప్పుడు ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అదే ప్రజాభిప్రాయం అన్న చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యూయేట్ ఓటర్లు కొట్టిన దెబ్బతో జగన్ సర్కార్ కు మైండ్ బ్లాంక్ అయింది. పంచాయతీ ఎన్నికల్లో ఎదురుగారి స్పష్టంగా ఉంది. ఇప్పటికిప్పుడు అలాంటి ఓటింగ్ జరగాలని కోరుకోవడం లేదు. అక్కడే వైసీపీ తేలిపోతోంది