రివ్యూ: దసరా

Dasara Movie Telugu Review

రేటింగ్‌: 2.75/5

ఓ పల్లె కథని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేయాలంటే.. ప్రమోషనల్ కంటెంట్ యూనిక్ గా వుండాలి. నాని ‘దసరా’ ఈ విషయంలో మంచి పనితనం కనబరించింది. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకూ.. ప్రతిది దసరాపై ఆసక్తిని పెంచింది. నాని వీర మాస్ గా కనిపించాడు. పాటలన్నీ జనాల నోట్లో నానాయి. చమ్కీల అంగీలేసి పాట అయితే బాగా వైరల్ అయ్యింది. నాని దేశమంతా తిరిగి తన శక్తిమేర బజ్ క్రియేట్ చేశాడు. నాని కెరీర్ లో ప్రీరిలీజ్ బిజినెస్ పరంగా కూడా రికార్డ్ సాధించింది దసరా. మరి ఇన్ని రకాలుగా ఆసక్తిని పెంచిన ‘దసరా’ ఎలాంటి అనుభవాన్ని పంచింది ? వీర్లపల్లిలో జరిగిన ఈ కథ పాన్ ఇండియా ప్రేక్షకులని ఆకట్టుకునే అవకాశం ఎంత? దసరా నానికి తొలి పాన్ ఇండియా విజయాన్ని ఇచ్చిందా ?

కరీంనగర్ జిల్లా వీర్లపల్లి. ధరణి (నాని), సూర్యం (దీక్షిత్ శెట్టి) బాల్య స్నేహితులు. చిన్నప్పుడే వెన్నెల (కీర్తి సురేష్) ని ఇష్టపడతాడు ధరణి. అయితే సూర్యం తనకు వెన్నెల అంటే ఇష్టం అని చెప్పడంతో వెన్నెలపై ప్రేమని తనలోనే దాచేస్తాడు ధరణి. పెద్దయిన తర్వాత ధరణి, సూర్యం రైలు బొగ్గులు దొంగతనం చేస్తూ, తన వూర్లో వున్న సిల్క్ బార్ లో మందుతాగుతూ స్నేహితులతో సరదాగా కాలం గడిపేస్తుంటాడు. వెన్నెల అంగన్ వాడీ టీచర్ గా పని చేస్తుంటుంది. ఊర్లో వుండే సిల్క్ బార్ పై ఆధిపత్యం పంచాయితీ సర్పంచ్ కి వుంటుంది. ఆ బార్ కోసం చిన్న నంబి (చాకో), రాజన్న (సాయికుమార్) పోటీ చేస్తారు. ధరణి, సూర్యం.. రాజన్న వైపు నిల్చుంటారు. తర్వాత ఏం జరిగింది ? ఆ రాజకీయాలు ధరణి, సూర్యం, వెన్నెల ల జీవితాన్ని ఎలా మార్చాయి ? వారి జీవితాల్లో ఎలాంటి మలుపులు వున్నాయి ? ఈ దసరా కథలో రావణుడు ఎవరు ? రావణ సంహారం ఎలా జరిగింది? అనేది మిగతా కథ.

స్నేహం, ప్రేమ, పగ.. ఇవన్నీ అందరినీ కదిలించే ఎమోషన్స్. వెండితెరపై చాలా సార్లు చూసిన ఎమోషన్స్. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. ఈ ఎమోషన్స్ చుట్టే దసరా కథని అల్లుకున్నాడు. స్నేహం, ప్రేమ, పగ.. ఈ మూడు ఎమోషన్స్ కి తగ్గట్టే.. ధరణి, సూర్యం, వెన్నెల అనే మూడు బలమైన పాత్రలు రాసుకున్నాడు. ఆ పాత్రలలో వుండే కోర్ ఎమోషన్స్ ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం కొన్ని చోట్ల బాగానే వర్క్ అవుట్ అయ్యింది.. ఇంకొన్ని చోట్ల కాస్త డీలా పడింది.

వీర్లపల్లి ఊరు..అక్కడి మనుషులు, ముగ్గురు స్నేహితులు.. బాల్యాన్ని గుర్తు చేసే ఓ అమ్మలాలో పాటతో ధరణి ప్రపంచాన్ని పరిచయం చేయడం బావుంది. పెద్దయ్యాక రైల్లో బొగ్గులు దొంగతనం చేసే ఎపిసోడ్ తో నాని మాస్ ఎంట్రీ కూడా కొత్తగా వుంటుంది. అయితే తర్వాత వచ్చే సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. ముందు తాగితే గానీ ధైర్యం తెచ్చుకోలేని ధరణి పాత్ర, చలాకీగా వుండే వెన్నెల, సూర్యం.. పాత్రలు బాగానే ఉన్నప్పటికీ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు.. సహజమైన ఆసక్తికరమైన డ్రామాని క్రియేట్ చేయలేకపోయాయి. ఎన్నికలు, అంతకుముందు క్రికెట్ ఎపిసోడ్. చాలా సింపుల్ గా తేల్చేశారు. ఈ కథలో బలమైన హై మూమెంట్స్ క్రియేట్ చేసే అవకాశం వుంది. ధరణి సిల్క్ బార్ లో అడుగుపెట్టె సీన్ లో కథ పరంగా కూడా చాలా హైవుండే మూమెంట్. కానీ దాన్ని బేలగా డీల్ చేశాడు దర్శకుడు. విరామానికి ముందు వచ్చే ఘట్టం ఈ సినిమాకి కీలకం. అసలు కథ అదే . ఆ సీక్వెన్స్ ని మాత్రం చాలా ఇంటెన్స్ గా తీశాడు. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత అందరిలో కలుగుతుంది.

తొలిసగంతో పోల్చుకుంటే రెండో సగంలో అసలు కథని నడిపాడు దర్శకుడు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఎపిసోడ్.. రంగస్థలంలోని సన్నివేశాలని గుర్తు చేసినప్పటికీ.. చిన్నప్పటినుంచి కలసి చదువుకున్న స్నేహితురాలు తన కళ్ళముందే బొట్టు గాజులు లేకుండా వుండటం చూసి చలించిపోయిన ధరణి.. తను తీసుకున్న నిర్ణయం హార్డ్ హిట్టింగ్ వుంటుంది. ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక బలమైన కారణం చూపడం.. డ్రామాలో సహజంగా కలిసింది.

దసరాలో విలన్ ఎవరనే సంగతి ముందు నుంచే తేలుస్తుంటుంది. అయితే అతని వెనుక వున్న కారణం.. రివిల్ చేసిన విధానం.. ఒక ట్విస్ట్ లానే వుంటుంది. శత్రువు ఎవరో తెలిసిన తర్వాత, చంపాల్సింది ఎవరినో అర్ధమైన తర్వాత.. తర్వాత వచ్చే సీన్స్ లో హైవుండాలి. కానీ దసరాలో హై కాస్త తగ్గిందనే చెప్పాలి. వెన్నెల జోలికి వస్తే.. చంపేస్తానని ధరణి ఇచ్చిన ఒక్క వార్నింగ్ తప్పితే.. ఇందులో విలన్ కి హీరోకి మధ్య బలమైన సంఘర్షణ కనిపించదు. పైగా విలనే తన పాత్రలో వున్న నెగిటివ్ కోణాన్ని వెన్నెల ముందు చెప్పుకోవడం ఇంకాస్త బేలగా వుంటుంది.

వీర్లపల్లి యుద్ధ కాండము: దసరాలో రెండు హై మూమెంట్స్ వున్నాయి. ఒకటి ఇంటర్వెల్ బాంగ్ అయితే.. రెండు.. క్లైమాక్స్. ఈ రెండూ యాక్షన్ సీన్లే. కానీ చాలా గ్రిప్పింగా తీశారు. దసరా రోజున ధరణి ని చంపేయాలని మనుషుల్ని పురమాయిస్తాడు విలన్. అయితే ఒక్కడ్ని చంపడానికి ఏకంగా ఒక పెద్ద మిలటరీనే దిగినట్లుగా వుంటుంది. ఈ ఫైట్ లో రామాయణంలోని యుద్ధ కాండ రిఫరెన్స్ కనిపిస్తుంది. యుద్ధ కాండ ఎంతభీకరంగా జరిగిందో.. అంత భీవత్సమైన యుద్ధం ధరణి చేస్తాడు. స్నేహితుల గుంపు కూడా వానరుల్లా వచ్చి రాక్షసులతో పోరాటం చేసిన సుధీర్గమైన ఈ ఫైట్ సీక్వెన్స్ ని ఎక్కడా బోర్ కొట్టించకుండా తీయగలిగాడు దర్శకుడు.

నాని ఇంత మాస్ క్యారెక్టర్ కనిపించడం ఇదే తొలిసారి. ఫస్ట్ సీన్ నుంచి చివరి సన్నివేశం వరకూ ధరణి పాత్ర నుంచి బయటికి రాలేదు. అంత సహజంగా ఈ మాస్ క్యారెక్టర్ ని మోశాడు నాని. చాలా చోట్లా .. ‘నానిలో ఇంత మాస్ ఉందా’’అన్నట్లుగా వుంటుంది. వెన్నెలపై ప్రేమని తనలోనే అనుచుకున్న సన్నివేశాల్లో నాని కళ్ళలో బాధ ప్రేక్షకుడు ఫీలౌతాడు. పోరాట సన్నివేశాల్లో కొత్త నానిని చూపించాడు. సూర్యం పాత్ర చేసిన దీక్షిత్ శెట్టి నటనకు కూడా ఫుల్ మార్కులు పడతాయి. ఫస్ట్ హాఫ్ లో నానికి సరిసమానమైన పాత్రది. వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ ఎంతో సహజంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఎంత చలాకీగా వుండేవుంటుందో రెండో సగంలో అంత సీరియస్ అయిపోయే పాత్రది. రెండు షేడ్స్ ని చక్కగా చూపించింది. ఇంటర్వెల్ కి ముందు వెన్నెల చేసే తీన్మార్ డ్యాన్స్ బోనస్. సుముద్రఖని పాత్రని బలంగా వాడుకోలేదు. రాజన్న పాత్రలో చేసిన సాయి కుమార్ పాత్ర కూడా పరిమితంగానే వుంటుంది. చిన్న నంబి పాత్రలో చేసిన చాకో తనదైన శైలిలో చేశాడు. ఈ కథలో మరో బలమైన పాత్రది. ఝాన్సీ, జరీనా వాహేబ్, పూర్ణ కూడా పరిధిమేర చేశారు. ఫ్రండ్స్ గ్యాంగ్ లో కనిపించిన వారంతా కొత్తవారే. అయితే పెద్దగా రిజిస్టర్ కాలేదు.

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. సత్యన్ సూర్యన్ కెమరా పనితనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెమరా కేవలం వీర్లపల్లిలోనే తిరుగుతుందనే ఫీలింగ్ కలిగించకుండా ప్రతి ఫ్రేం ని చాలా శ్రద్ధతో తీర్చిదిద్దిన పనితీరు కనిపిస్తుంది. సంతోష్ నారాయణ్ సంగీతానికి ఫుల్ మార్కులు పడిపోతాయి. ఓ వారి, చమ్కీల అంగీలేసి, దూమ్ ధామ్ పాటలు చూడటానికి కూడా బావున్నాయి. నేపధ్య సంగీతం మరో పెద్ద ఆకర్షణ.. దసరా థీమ్, వెన్నెల థీమ్, ధరణి థీమ్.. ఇలా గుర్తుపెట్టుకోదగ్గ స్కోర్ ఇచ్చారు. యాక్షన్ ఎమోషన్స్ సీన్స్ ని ఆయన బీజీఎం మరి స్థాయికి తీసుకెళ్ళాయి. అవినాస్ కొల్లా వీర్లపల్లిని జీవం ఉట్టిపడేట్లు సెట్ వేశారు. చాలా సహజంగా కుదిరింది. రైటింగ్ లో యాసని పక్కాగా పాటించారు. అందరి చేత చక్కగా తెలంగాణ యాస పలికించారు.

కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మేకింగ్.. ఎక్కడా కొత్త దర్శకుడనే భావన కలిగించదు. ఇద్దరు స్నేహితులు, వాళ్ళ స్నేహం, ప్రేమలోని ఎమోషన్స్ బలంగా నమ్మాడు దర్శకుడు. దాన్నే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే విరామం, ముగింపులో ఉన్నంత బలం.. మిగతా చోట్ల కూడా కోనసాగించి వుంటే.. దసరా మరింత వేడుకగా వుండేది.

రేటింగ్‌: 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడి ‘ఎస్‌.. బాస్‌’

పిల్ల‌జ‌మిందార్‌, భాగ‌మ‌తి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు అశోక్. ఆ త‌ర‌వాత‌.. అశోక్ ఓ సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. అప్ప‌టి నుంచి అశోక్ ఏం చేస్తున్నాడు? త‌న త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అనే...

దక్షిణాదిలో తగ్గిపోయే లోక్‌సభ సీట్లపై కేటీఆర్ ఆందోళన!

దక్షిణాదికి దేశంలో ప్రాధాన్యం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్ సభ సీట్లను తగ్గించబోతున్నారని చాలా కాలంగా పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2026వ...

రైతు భరోసా క్యాలెండర్ తప్పింది !

జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసినా సంక్షేమ క్యాలెండర్ ను మాత్రం వదిలి పెట్టకుండా అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అది కూడా దారి తప్పుతోంది. చెప్పిన...

బింబిసార-2కి కొత్త దర్శకుడు?

కల్యాణ్‌ రామ్‌ సోషియో ఫాంటసీ 'బింబిసార’ మంచి విజయాన్ని అందుకుంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి మళ్ళీ జోష్ తెచ్చింది. దీనికి పార్ట్ 2 వుంటుందని సినిమా ముగింపులోనే చెప్పారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close