‘ద‌స‌రా’ 36 క‌ట్స్‌.. ద‌ర్శ‌కుడి మాటేంటి?

నాని సినిమా అంటే… కుటుంబ స‌మేతంగా చూసేలా ఉంటాయి. త‌న ఫ్యాన్స్ లో ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఎక్కువ‌. అయితే.. ద‌స‌రా మాత్రం అందుకు భిన్నంగా క‌నిపిస్తోంది. టైటిల్ సాఫ్ట్ గా ఉంది కానీ, లోప‌ల మేట‌ర్ వేరేలా ఉంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూస్తేనే ఆ విష‌యం అర్థం అవుతోంది. నాని మాస్ అవ‌తార్‌, ఆ యాక్ష‌న్ మూమెంట్లు ఇవ‌న్నీ నాని గ‌త చిత్రాల కంటే భిన్నంగా క‌నిపిస్తున్నాయి. దానికి తోడు సెన్సార్ వాళ్లు ఏకంగా 36 క‌ట్స్ వేశారు. నాని సినిమాకే కాదు.. ఈమ‌ధ్య ఇన్ని సెన్సార్ క‌ట్స్ ప‌డిన సినిమా ఇదేనేమో..?

దీనిపై ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల స్పందించారు. ”నాకు సెన్సార్ నిబంధ‌న‌ల గురించి పెద్ద‌గా తెలీదు. బాంచ‌త్ అనే ప‌దం ఈ సినిమాలో ఉంది. ఆ ప‌దాన్ని తెలంగాణ‌లో చాలా సాధార‌ణంగా వాడ‌తారు. అందులో బూతు లేదు. బాంచ‌త్ లానే, బాంచ‌న్‌.. అనే మ‌రో ప‌దం ఉంది. ఇవి రెండూ వేరు. ఇదే.. అర్థం వ‌చ్చేలా ఓ బూతు ప‌దం కూడా ఉంది. అది వేరు. ఈ మూడు ప‌దాల అర్థాలూ ఒక్క‌టే అనుకొంటున్నారు. బాంచ‌త్ అనే ప‌దం ఓ పాట‌లో నాలుగుసార్లు వచ్చింది. నాలుగు క‌ట్స్ ప‌డ్డాయి. అలా క‌ట్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అంతే త‌ప్ప‌.. మా సినిమాలో బూతు, పెద్ద‌లు నొచ్చుకొనే స‌న్నివేశాలూ ఏం ఉండ‌వు” అని క్లారిటీ ఇచ్చారు. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రం ఈనెల 30న విడుద‌ల అవుతోంది. నాని కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ తో రూపొందించిన చిత్ర‌మిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య భాగ‌వ‌తుల‌ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్షించుకున్న తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న...

బీజేపీ, మోదీ మాటెత్తకుండానే కేసీఆర్ బహిరంగసభ ప్రసంగం !

కేసీఆర్ బహిరంగసభా వేదికపై గత రెండు, మూడేళ్లలో ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం బీజేపీ, మోదీని విమర్శించడానికే ఉండేది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని చెప్పేవారు ....

కాంగ్రెస్ పిలిస్తే కోదండరాం కూడా రెడీ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పని చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. తాజాగా కోదండరాం కూడా రెడీ అయ్యారు. తెలంగాణ పరిరక్షణకు.. ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తోందని..తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడంకోసం తెలంగాణ...

నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి!

ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసే టీడీపీ నేతల ఇళ్లపైకి రౌడీముకల్ని పంపి దాడులు చేయించడం ... పోలీసులు చూస్తూ ఉండటం కామన్ గా మారిపోయింది. గతంలో పట్టాభి ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close