దత్తన్న తొందరపడి లేఖ వ్రాసారా?

కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకి వ్రాసిన లేఖ కారణంగా జరిగిన పరిణామాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ మరణానికి దారి తీసాయని స్పష్టం అవుతోంది. ఈ సమస్యకి మూల కారణం రోహిత్ ప్రాతినిద్యం వహిస్తున్న అంబేద్కర్ విద్యార్ధి సంఘానికి చెందిన కొందరు విద్యార్ధులు ముంబై బాంబు ప్రేలుళ్ళ సూత్రధారి యాకుబ్ మీమన్ ఉరిని వ్యతిరేకించారని, అప్పుడు వారికీ, బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న ఏబివిపి విద్యార్ధి సంఘానికి చెందిన విద్యార్ధులకి మధ్య ఘర్షణ అని దత్తాత్రేయ లేఖని చూస్తే అర్ధమవుతోంది. కానీ అది నిజమో కాదో ఆ విద్యార్ధులకి తప్ప మరెవరికీ తెలియదు. అయితే అంబేద్కర్ విద్యార్ధి సంఘంలో విద్యార్ధులు ఎవరూ యాకుబ్ మెమన్ ఉరిని వ్యతిరేఖించడానికి బలమయిన కారణాలు ఏవీ కనిపించడం లేదు. వారు వ్యతిరేకించారా లేదా అనేది విచారణలో తేలాలి. యాకుబ్ మీమన్ ఉరిని దేశంలో చాలా మంది వ్యతిరేకించారు. కనుక ఒకవేళ అంబేద్కర్ సంఘం విద్యార్ధులు కూడా ఏ కారణం చేతయినా దానిని వ్యతిరేకించి ఉండి ఉంటే అదేమీ పెద్ద నేరం కాదు. కనుక ఆ కారణంతో వారిపై చర్యలు తీసుకోమని బండారు దత్తాత్రేయ లేఖ వ్రాసి ఉంటే అది తొందరపాటే అని భావించాల్సి ఉంటుంది.

ఇటీవల ఉస్మానియాలో ‘బీఫ్ ఫెస్టివల్’ పై రెండు విద్యార్ధి సంఘాల మధ్య గొడవ జరిగినట్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా జరిగి ఉండే అవకాశం ఉంది. కానీ ఆ యూనివర్సిటీ అటువంటివేవీ జరిగినట్లు మీడియాలో వార్తలు రాలేదు. అంటే వేరే ఇతర కారణాల చేత, బహుశః కులాల కారణంగానే వారి మధ్య ఘర్షణ జరిగి ఉండవచ్చును. అదే నిజమయితే, ఏబివిపి విద్యార్దుల పిర్యాదులను నమ్మి బండారు దత్తాత్రేయ తొందరపడి కేంద్రానికి లేఖ వ్రాసినట్లు భావించవలసి ఉంటుంది. అప్పుడు ఆ లేఖపై మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా అతిగానే స్పందించినట్లుగానే భావించక తప్పదు. కేంద్రం నుండి ఒత్తిడి వస్తునప్పుడు యూనివర్సిటీ చేతులు ముడుచుకొని కూర్చోలేదు కనుక ఐదుగురు విద్యార్ధులను సస్పెండ్ చేసి ఉండవచ్చును.

ఇప్పుడు కమిటీలు వేసుకొని విచరణ చేసి తాపీగా వాస్తవాలు కనుగొన్నప్పటికీ చనిపోయిన రోహిత్ ని తిరిగి బ్రతికించుకోలేము. కనుక ఇకనయినా విద్యార్ధుల గొడవలలో రాజకీయ నేతలు వేలు పెట్టకుండా ఉంటే మంచిది. అలాగే విద్యార్ధులు కూడా ఈ కులం, మతం, ప్రాంతం, బాష వంటి సంకుచిత భావాలలో పది కొట్టుకుపోతూ సాటి విద్యార్ధులతో ఘర్షణ పడటం సరికాదు. భారతదేశ భవిష్యత్ తమపైనే ఆధారపడి ఉందనే సంగతి సదా గుర్తుంచుకొని, అందుకు అనుగుణంగా దేశం గర్వించే విధంగా పైకి ఎదగాలి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్ధులను పావులుగా వాడుకొంటాయనే సంగతి రోహిత్ మరణంపై అవి చేస్తున్న హడావుడితో ప్రత్యక్షంగా కనబడుతోంది. రాజకీయ నాయకులు ఆడుకొనే ఇటువంటి వికృత రాజకీయ క్రీడలో విద్యార్ధులే తరచూ బలవుతున్నరనే సంగతి వారు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. కనుక విద్యార్ధులు రాజకీయ పార్టీలకి, నేతలకీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిదే దేశద్రోహం కాదు..! మరి రక్షణ దేశంలో ఉందా..!?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన దేశ ద్రోహం కిందకు రాదని సుప్రీం కోర్టు తేల్చేసింది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై దాఖలైన కేసులో కోర్టు ఈ మేరకు కీలక తీర్పు చెప్పింది....

ఏపీలో పోర్టులన్నీ ఆదాని పరం..!

ఆంధ్రప్రదేశ్ ప్లస్ పాయింట్ సుదీర్ఘ తీరమని.. పోర్టులతో తట్టుకోలేనంత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం కూడా.. చాలా చాలా మాటలు చెబుతూ ఉంటాయి. కానీ.. వాస్తవానికి కొత్త...

“అన్యాయ మాటలు”.. సీజేఐ వైదొలగాలనే డిమాండ్లు..!

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగం, చట్టాల పట్ల సంపూర్ణమైన అవగాహనతో ఉంటారని అనుకుంటారు. నిన్నామొన్నటి వరకూ సీజేఐ బోబ్డేపై అలాంటి అభిప్రాయమే ఉండేది. అయితే.. మహారాష్ట్రకు చెందిన...

శశికళ రిటైర్డ్ హర్ట్ మాత్రమే..రిటైర్మెంట్ కాదు..!

శశికళ అమ్మ జయలలిత సమాధి మీద శపథం చేశారు. జైల్లో ఓపిగ్గా శిక్ష అనుభవించారు. రిలీజై వచ్చిన తర్వాత రాజకీయాల్లో తేల్చుకుంటానన్నారు. అయితే హఠాత్తుగా రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటున్నానని ప్రకటించారు. ఇది...

HOT NEWS

[X] Close
[X] Close