‘డియర్’ రివ్యూ: థియేట‌ర్లో ప్రేక్ష‌కుల కునుకుపాట్లు

Dear Movie Telugu Review

తెలుగు360 రేటింగ్‌: 2.25/5

-అన్వ‌ర్‌

గురక కారణంగా వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయో ‘గుడ్ నైట్’ సినిమాలో చాలా వినోదాత్మకంగా చూపించారు. అందులోని ప్రేమకథ, పాత్రలని తీర్చిదిద్దిన తీరు అందంగా కుదిరింది. ఇప్పుడు అదే గురక కాన్సెప్ట్ తో మరో తమిళ సినిమా ‘డియర్’ డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ గురకలోని వున్న కొత్తదనం ఏమిటి? గుడ్ నైట్ లాంటి మరో ఫీల్‌ గుడ్ మూవీ అయ్యిందా?

అర్జున్ (జీవీ ప్రకాష్ కుమార్) సైలెంట్ స్లీపర్. పెన్సిల్ కిందపడిన‌ శబ్ధం వినిపించినా తన నిద్రకు విఘాతం కలుగుతుంది. దీపిక (ఐశ్వర్య రాజేష్)ది మరోరకమైన పరిస్థితి. తను సౌండ్ స్లీపర్. నిద్రలో జారుకున్న మరుక్షణం నుంచే గురక పెడుతుంది. అలాంటి ఈ ఇద్దరూ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. తనకు గురక అలవాటు వుందనే సంగతి పెళ్లికి ముందు అర్జున్ తో చెప్పలేకపోతుంది దీపిక. పెళ్లి తర్వాత ఈ గురక కారణంగా వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి? గురక భరించలేని అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది మిగతా కథ.

డియర్ ట్రైలర్ చూడగానే ‘గుడ్ నైట్’ తో పోలిక రావడం సహజం. డియర్ కాన్ ఫ్లిక్ట్ కూడా అదే. అయితే గుడ్ నైట్ లోని వినోదం, ఆసక్తి డియర్ లో కనిపించలేదు. ట్రైలర్ చూడగానే కథ అర్ధమైపోతుంది. ఇలాంటి సందర్భంలో కథనం ఆసక్తిగా నడపాలి. ఇందులో అది జరగలేదు. ఓ సీరియ‌ల్ సాగుతున్న‌ట్టు చాలా నింపాదిగా, నిదానంగా సాగదీతగా నడిచిన సన్నివేశాలు ఆవలింతలు తెప్పిస్తాయి. గుడ్ నైట్ సినిమాలోని పాత్రలు ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా వుంటాయి. ఆ రెండు పాత్రలపై సానుభూతి కలుగుతుంది. డియర్ లో అలాంటిదేమీ వుండదు. ఆ పాత్రల ఎమోషన్ తో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేరు. పైగా ఈ కాన్సెప్ట్ అప్పటికే చూసింది కావడంతో అందులోని విలక్షణత కూడా తగ్గిపోతుంది.

తొలి సగం అంతా గురక చుట్టూ నడిపిన దర్శకుడు తర్వాత, ఆ కాన్సెప్ట్ ని పక్కన పెట్టి కుటుంబం, అనుబంధాల చుట్టూ సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు. సబ్ ప్లాట్ గా అర్జున్ తల్లి( రోహిణి) అన్న ( కాళీ వెంకట్) చుట్టూ నడిపిన డ్రామాలో ఫ్యామిలీ ఎమోషన్ వుంది కానీ ఈ కథకు అది అంతగా అతకలేదు. దీంతో పాటు దీపిక, అర్జున్ ల విడాకులు, పిల్లల విషయంలో దీపిక తీసుకున్న నిర్ణయం సరిగ్గా పొసగలేదు. గురకని కాన్సెప్ట్ గా తీసుకున్న దర్శకుడు అదే కథతో గుడ్ నైట్ సినిమా వుండటంతో డియర్ ని మరోలా చెప్పే ప్రయత్నంలో ఎక్కడా స్థిరత్వం లేకుండా ఈ కథనాన్ని నడిపిన తీరు ప్రేక్షకులు సహనానికి చాలా చోట్ల పరీక్షపెడుతుంది.

అర్జున్ పాత్రలో జీవి ప్రకాష్ కనిపించిన విధానం పర్వేలేదనిపిస్తుంది కానీ అతని పాత్రలో స్థిరత్వం లేదు. కాసేపు ఎమోషనల్ గా కాసేపు ఎమోషనల్ లెస్ గా, ఇంకాసేపు తికమకగా ఉంటాడు. ఐశ్వర్య రాజేష్ మంచి నటి. దీపిక పాత్రలో సహజంగా కుదిరింది. అయితే ఆ పాత్రని వన్ సైడెడ్ గా నడిపిన తీరు అంతగా మెప్పించదు. రోహిణి అనుభవం క్లైమాక్స్ లో కనిపిస్తుంది. నిజంగానే ఆ సీన్ లో ఎమోషన్ వుంది. కాళీ వెంకట్ తో పాటు మిగతా పాత్రలు పరిధిమేర కనిపిస్తాయి.

జీవి మ్యూజిక్ లో మెరపులు లేవు. ఒక్క పాట కూడా రిజిస్టర్ కాదు. పైగా కొన్ని పాటలు చిరాకు తెప్పిస్తాయి. నేపధ్య సంగీతం కూడా సోసోగానే వుంది. కెమరాపని తనం పర్వేలేదు. ఎడిటింగ్ చాలా పదునుగా ఉండాల్సింది. తెలుగు డబ్బింగ్ కూడా అంతగా కుదరలేదు. గుర్తుపెట్టుకునే మాటలు లేవు. ఫ్యామిలీ ఎమోష‌న్స్ అక్క‌డ‌క్క‌డ ఓకే అనిపిస్తాయి. నిర్మాణంలో క్వాలిటీ క‌నిపించింది. ఓ సింపుల్ లైన్ ప‌ట్టుకొని.. రెండుగంట‌ల పాటు కూర్చోబెట్ట‌డం క‌త్తిమీద సామే. కాక‌పోతే.. స‌న్నివేశాల్లో వినోదం, ఫీల్ గుడ్ ఎమోష‌న్ ఉండేలా చూసుకొంటే బాగుండేది.

తెలుగు360 రేటింగ్‌: 2.25/5

-అన్వ‌ర్‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close