మీడియా వాచ్‌: డెక్క‌న్ క్రానిక‌ల్ ఉద్యోగుల ధ‌ర్నా

కోవిడ్ ఎఫెక్ట్‌… ప‌త్రిక‌ల‌పై బాగా ప‌డింది. కొన్ని ప్ర‌ధాన ప‌త్రిక‌లు ఉద్యోగుల్ని త‌ల‌గొంచాల్సివ‌చ్చింది. జీతాల‌కు కోత విధించారు. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు మెరుగు ప‌డుతున్నాయి. అయితే స‌డ‌న్ గా ఇప్పుడు కోవిడ్ పేరు చెప్పి డెక్కెన్ క్రానిక‌ల్ ఉద్యోగ‌స్థుల జీతాల‌కు సంస్థ కోత వేసింది. ఉద్యోగుల జీతం నుంచి 20 శాతం క‌ట్ చేస్తూ… నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఉద్యోగులు నిర‌స‌న‌కు దిగారు. హైద‌రాబాద్ కేంద్రంలో ప్ర‌స్తుతం ఉద్యోగులు స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తున్నారు. ఈ ఉద‌యం నుంచి `పెన్ డౌన్‌` చేసి త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. డెక్కెన్ క్రానిక‌ల్ ఉద్యోగ‌స్థుల‌కు సెప్టెంబ‌రు నుంచి జీతాల్లేవు. అంటే జీతం అందుకుని 5 నెల‌లు అయ్యింద‌న్న‌మాట‌. ఈ ఐదు నెలల జీతాల గురించి ఉద్యోగ సంస్థ నాయ‌కులు ఆరా తీస్తే.. `20 శాతం కోత విధించి.. జీతాలు అందిస్తామ‌`ని యాజ‌మాన్యం చెప్పింది. అస‌లే ఐదు నెల‌ల నుంచి జీతాలు లేవు, ఇప్పుడు అందులో 20 శాతం కోతేంటి? అన్న‌ది ఉద్యోగ‌స్థుల ప్ర‌శ్న‌. పైగా కోవిడ్ బాధ‌లు త‌ప్పాయి. సంస్థ మ‌ళ్లీ గాడిలో ప‌డింది. ఇలాంట‌ప్పుడు కోత విధించ‌డం భావ్యం కాద‌ని ఉద్యోగులు వాదిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close