రివ్యూ: దీపావళి

తారాబలం లేకపోయినా మంచి కంటెంట్ వుంటే థియేటర్స్ కి జనం వస్తారని నమ్మకాన్ని కలిగించాయి కొన్ని సినిమాలు. శ్రీ శ్రవంతి మూవీస్ నిర్మాణంలో ‘దీపావళి’ చిత్రం కూడా ఇలానే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నేరుగా థియేటర్స్ లోకి వచ్చింది. ట్రైలర్ చూస్తేనే ఇందులో కథే హీరో అనే సంగతి అర్ధమైయింది. నిర్మాత స్రవంతి రవికిషోర్ నమ్మకం కూడా అదే. తమిళంలో ‘కిడ’ పేరుతో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించి ‘దీపావళి’గా విడుదల చేశారు. మరి తాతామనవాళ్ళ కథ ప్రేక్షకుల మనసుని హత్తుకుందా? ఈ దీపావళి ఎలాంటి వెలుగుల్ని పంచింది?

తనపల్లి అనే పల్లెటూరిలో ఓ పూరిగుడిసెలో భార్య, మనవడు గణేష్(మాస్టర్ దీపన్) తో కలసి జీవిస్తుంటాడు సీనయ్య( పో రామ్). దీపావళికి ఇంకొన్ని రోజులు వుందనగా మనవడు గణేష్ కొత్తబట్టలు కావాలని తాత సీనయ్యని అడుగుతాడు. గణేష్ ఇష్టపడిన డ్రెస్ కోసం షాఫ్ కి వెళ్ళిన సీనయ్యకు ఆ డ్రెస్ ఖరీదు రెండువేల రూపాయిలని తెలుస్తుంది. తన దగ్గర అంత సొమ్ము వుండదు. అప్పు చేసైనా మనవాడి కోరిక తీర్చాలని భావిస్తాడు. సమయానికి అప్పు కూడా పుట్టదు. దీంతో మరో దారిలేక మొక్కు కోసం పెంచిన మేకని అమ్మేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే అది మొక్కు మేక కావడం వలన కొనడానికి ఎవరూ ముందుకురారు. ఇదే సమయంలో బాషా మటన్ కొట్టులో పని చేసే వీరయ్య (కాళి వెంకట్) తన ప్రవర్తన కారణంగా పని పోగొట్టుకుంటాడు. ఎలాగైనా సొంతగా మటన్ కొట్టుపెట్టుకొని బాషా కళ్ళముందే దర్జాగా వ్యాపారం చేయాలని లక్ష్యం పెట్టుకుంటాడు వీరయ్య. సరిగ్గా ఇదే సమయంలో సీనయ్య సంగతి తెలుసుకొని మొక్క మేక అయినా పర్వాలేదని, పదివేలకు మేకని కొనుక్కుంటాడు. ఐదు వందలు అడ్వాన్స్ కూడా ఇస్తాడు. మిగతా డబ్బు ఇవ్వడం కోసం చాలా మంది దగ్గర మటన్ ఇస్తానని చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకుంటాడు. అయితే దీపావళి ముందు రోజు రాత్రి మేకని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగలిస్తారు. మరి ఆ మేక దొరికిందా? సీనయ్య మనవనికి కొత్త బట్టలు కొన్నాడా? వీరయ్య మటన్ కొట్టు కల ఏమయింది ? చివరికి ఆ పాత్రలన్నీ ఏ దరికి చేరాయి ? అనేది తెరపై చూడాలి.

నిర్మాణ పరంగానే కాదు కథ పరంగా కూడా చిన్న కథ దీపావళి. కానీ ఈ చిన్న కథలోని మనసుని కదిలించే కొన్ని భావోద్వేగాలు, అకస్మాత్తుగా కళ్ళ నీళ్ళు తెప్పించే కొన్ని సన్నివేశాలు వున్నాయి. అన్నిటికి ముఖ్యంగా నిజాయితీ, మానవత్వం వున్న కథ ఇది. పండక్కి కొత్త బట్టలు కావాలని అడిగిన మనవడి కోసం.. తాత పడే తాపత్రయం చుట్టూ అల్లుకున్న ఓ అందమైన పల్లెటూరి కథ ఇది. ఈ కథలో లాగ్ లైన్ జెర్సీ సినిమాని గుర్తుకు తెచ్చినప్పటికీ ఇందులో ఆత్మవేరు. ఎలాంటి హడావిడి లేకుండా నింపాదిగా కథ మొదలౌతుంది. మనవడు కొత్త బట్టలు కావాలని కోరడం, ఎలాగైనా మనవడి కోరికని తీర్చాలని తాత భావించడం, డబ్బులు లేని నిస్సాయత.. ఇవన్నీ తెరపై చూస్తున్నపుడు నిజ జీవితానికి దగ్గరవుంటాయి. డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో మనవడు నిద్రపోయేదాక ఇంటికి వెళ్ళలేని ఓ తాతని చూస్తున్నప్పుడు అప్రయత్నంగా కళ్ళలో నీళ్ళు తిరిగేస్తాయి. అలాగని ఇందులో సన్నివేశాలు ఓవర్ డ్రమటిక్, ఎమోషనల్ గా వుండవు. సహజంగా ఆ పాత్రలపై కరుణ పడుతుంది. ఒక సానుభూతి కలుగుతుంది.

ఎత్తుకున్న పాయింట్ ఎంత చిన్నదైన దాని చుట్టూ ఆసక్తికరమైన డ్రామా పండించం ఒక నేర్పు. ఆ నేర్పు దర్శకుడిలో కనిపించింది. మేకను అమ్మేసిన డబ్బులతో కొత్తబట్టలు కోనేయొచ్చు. కానీ ఆ మేకను మొక్కుతో ముడిపెట్టారు. అదే సమయంలో మొక్కు మేక అయినా ఫర్లేదు.. తనకు వ్యాపారమే ముఖ్య్యమనే వీరయ్య పాత్రని ప్రవేశపెట్టారు. అంతా కుదురుకుందని ఆనుకున సమయంలో ఆ మేక దొంగతతాని గురౌతుంది. తర్వాత వచ్చిన సన్నివేశాలు కూడా మనసుని హత్తుకునేలా వుంటాయి. ముఖ్యంగా పిల్లాడు గణేష్ పాత్రకు, మేకకు మధ్య అనుబంధాన్ని చూపించే విధానం మనసుని కదిలిస్తుంది. తప్పిపోయిన మేక కోసం అందరూ వెదుకుతుంటారు. గణేష్ మాత్రం ఆ మేక కంటపడకూడదని కోరుకుంటాడు. ఈ సన్నివేశాన్ని చాల హృద్యంగా మలిచాడు దర్శకుడు. అలాగే గణేష్ అవ్వ.. తను దాచుకున్న చిల్లర డబ్బుని మార్పించి పెద్ద నోట్లు తీసుకోవడం, మటన్ కొట్టు బాషా, వీరయ్య భార్యకు సాయం చేయడం.. మానవత్వాన్ని చాటుతాయి. కథకు ముగింపు కూడా చక్కగా కుదిరింది. ఒక ఫీల్ గుడ్ ఎమోషన్ తో థియేటర్ నుంచి బయటికి వస్తాడు ప్రేక్షకుడు.

ఇక ఇందులో లోటుపాట్లు గురించి మాట్లాడుకుంటే.. చిన్న కథ ఇది. ఆల్రెడీ ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేశారు. దీంతో సినిమా చూస్తున్నపుడు కథ ఇంతేనా.. అనే భావనకి రావచ్చు. అలాగే కొన్ని సన్నివేశాలు సాగదీత, నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించవచ్చు. ఇక ఇందులో ఒక ప్రేమకథ వుంది. అది ఎందుకో ఇందులో సరిగ్గా ఇమడలేదు. ఆ ట్రాక్ లేకపోయినా దీనికి వచ్చిన నష్టం ఏమీలేదు. అలాగే థియేటర్ ఎక్స్పీరియన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం సినిమాకి వెళ్ళే ప్రేక్షకుల అంచనాలని ఈ చిత్రం అందుకోలేకపోవచ్చు. అలాగే దాదాపు ఇందులో తమిళ నటీనటులు, అక్కడి వాతావరణమే కనిపిస్తుంది. ప్రతి దశలోనూ ఇది ఒక అనువాద చిత్రమనే గుర్తుచేస్తుంటుంది.

సీనయ్య పాత్రలో చేసిన పో రామ్ ఆ పాత్రకు ప్రాణం పోశారు. చాలా సహజమైన నటన కనబరిచారు. అలాగే మనవడి పాత్ర చేసిన దీపన్ కూడా ఆకట్టుకున్నాడు. అతని కళ్ళలో అమాయకత్వం చక్కగా పలికింది. మేకపై తన ప్రేమని చూపించే సన్నివేశాలు బావుంటాయి. అలాగే వీరయ్య పాత్రలో చేసిన కాళీ వెంకట్ పాత్ర కూడా బావుంది. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

చిన్న సినిమా ఇది. బడ్జెట్ పరిమితులు తెరపై కనిపిస్తుంటాయి. అయితే ఈ కథకు కావాల్సినది సమకూర్చారు నిర్మాత. మంచి నేపధ్య సగీతం, కెమరాపనితనం కుదిరింది. పల్లెటూరి వాతావరణంతో పాటు రాత్రిసమయంలో తీసిన మేకల దొంగతనం సీక్వెన్స్ ని బాగా తీశారు. డబ్బింగ్ లో చిత్తూరు యాసని బాగానే పలికించారు. ఆ యాసలోని సొగసు కొన్ని డైలాగ్స్ లో కనిపిస్తుంది. ఒక నిజాయితీతో కూడుకన్న ప్రయత్నమిది. తారాబలం లేకపోయినప్పటికీ కథలోని భావోద్వేగాలు దీపావళి తారాజువ్వలా వెలుగుని పంచాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాల్పులు – నరికి వేతలు ! గోదావరి జిల్లాల్లో రక్త చరిత్ర !

ఓ వ్యక్తిని ఇంట్లోనే రెండు రౌండ్లతో కాల్చి చంపేశారు. అదీ కూడా గోదావరి జిల్లాల్లో. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో ఇలాంటి హత్యలు కూడా జరుగుతున్నాయా అని జనం ఆశ్చర్యపోయారు. చనిపోయిన...

‘హ‌ను – మాన్‌’ బ‌లం స‌రిపోతుందా?

'హను - మాన్‌' ప్రాజెక్ట్ మొద‌లెట్టిన‌ప్పుడు ఎవ‌రికీ ఆ సినిమాపై ఆశ‌లు, అంచ‌నాలూ లేవు. ఎప్పుడైతే టీజ‌ర్ వ‌చ్చిందో.. అప్పుడు అటెన్ష‌న్ సంపాదించుకొంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఏదో చేస్తున్నాడు, ఓ విజువ‌ల్ వండ‌ర్...

సుప్రీంకోర్టు తీర్పులపైనా నీలి, కూలి మీడియా తప్పుడు ప్రచారం !

తెలుగులో నీలి, కూలి మీడియా వ్యవహారం రాను రాను సంచలనంగా మారుతోంది. ఎంతగా అంటే చివరికి సుప్రీంకోర్టు తీర్పులనూ పూర్తిగా రివర్స్ లో ప్రచారం చేసేంత. సుప్రీంకోర్టు...

ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కంపెనీ ఇచ్చిన సొమ్ము జగన్ రెడ్డి సర్కార్ నొక్కేసిందా !?

జగన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోగానే... ఏపీలో జరిగిన అతి పెద్ద అరిష్టం విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం. ఆ ఘటనపై చాలా అనుమానాలున్నా... విచారణలో ఏదీ బయటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close