స్పిరిట్, కల్కి ప్రాజెక్టుల నుంచి అర్థాంతరంగా తప్పుకోవడంతో దీపికా పదుకొణె వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. రోజుకి 5 గంటలే పని చేస్తానని కండీషన్లు పెట్టడం, తన స్టాఫ్ జీతభత్యాల్ని కూడా నిర్మాతల దగ్గర్నుంచి వసూలు చేయడం, లాభాల్లో వాటా అడగడం ఇవన్నీ దీపికని ఈ ప్రాజెక్టుల నుంచి దూరం చేశాయి. దీపిక పెట్టే కండీషన్ల గురించి బాలీవుడ్ లోనూ ఆసక్తికరంగా మాట్లాడుకొంటున్నారు. అయితే దీపిక మాత్రమే కాదు.. భర్త రణవీర్ సింగ్ కూడా ఇంతేనట. కండీషన్లతో నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడంలో రణవీర్ దీపికకు ఏమాత్రం తీసిపోడని బాలీవుడ్ వర్గాలు చెవులుకొరుక్కొంటున్నాయి.
రణవీర్ సెట్లో ఉండాలంటే కనీసం 10 కార్ వాన్లు కావాలట. హీరోకి అన్నేసి క్యార్ వాన్లు ఎందుకు? అని ఎవ్వరూ అడగడానికి వీల్లేదు. ఓ క్యార్ వాన్ తనకు. ఒకటి జిమ్ కోసం. ఇంకోటి మీటింగుల కోసం, మరో రెండు తన పర్సనల్ సెక్యూరిటీ కోసం.. ఇలా ఈ లిస్టు పెరుగుతూ పోతుంది. రణవీర్ కోసం ప్రత్యేకంగా ఓ చెఫ్ ఉండాల్సిందేనని.. అతనికి ప్రత్యేకంగా జీతం చెల్లించాలని తెలుస్తుంది. సెట్లో ఓ రెస్టారెంట్ సెటప్ ఉంటుందని, అలాగని ప్రతీసారీ రణవీర్ అక్కడే తినడని, ఒక్కోసారి తనకు ఇష్టమైన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసి, ఆ బిల్లు నిర్మాతలతో కట్టిస్తాడని గుసగుసలాడుకొంటున్నారు. ఈమాత్రం దానికి చెఫ్ ఎందుకు? సెట్లోనే రెస్టారెంట్ సెటప్ ఎందుకు? ఈ విషయంలో దీపిక కూడా రణవీర్ ని ఫాలో అవుతుందని సమాచారం. ఈ ఎగస్ట్రా బాదుడు భరించలేకే.. దీపికను కాదనుకొంటున్నారు నిర్మాతలు.


