పవన్ కల్యాణ్ తో దేవిశ్రీ ప్రసాద్ కాంబో ఎప్పుడూ మిస్‌ఫైర్ కాలేదు. ‘జల్సా’ పాటలన్నీ సూపర్ హిట్టే. ‘గబ్బర్ సింగ్’ అయితే.. ఇక చెప్పాల్సిన పనిలేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఫ్లాప్ అయినా, ఆల్బమ్ మాత్రం నిరుత్సాహ పరచలేదు. ఇప్పుడు మరోసారి వీరి కాంబోని చూసే ఛాన్స్ దక్కింది. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తో. హరిష్ శంకర్‌కు మ్యూజిక్ విషయంలో మంచి టేస్ట్ వుంది. తన సినిమాల్లో పాటలన్నీ బాగుంటాయి. పైగా డీఎస్పీతో మంచి రాపో ఉంది. అందుకే ‘ఉస్తాద్’ లో పాటలెలా ఉంటాయో అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉస్తాద్ నుంచి ఫస్ట్ సింగిల్ గా ‘దేఖ్లేంగే’ రాబోతోంది. ఈరోజు ప్రోమో వదిలారు.
‘స్టెప్పేస్తే భూకంపం’ అనే హుక్ లైన్ తో ప్రోమో వదిలారు. ఆ కాసేపటి ప్రోమోకే పవన్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. పవన్ లుక్, గ్రేస్, డ్రస్సింగ్… ఇవన్నీ ఫ్యాన్స్‌కి బాగా నచ్చేశాయి. పవన్ పై తన అభిమానాన్ని దేవిశ్రీ మరోసారి ఈ సినిమాతో చాటుకోబోతున్నాడని అనిపిస్తోంది. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా `ఉస్తాద్` ఆల్బమ్ గురించి ప్రస్తావించాడు దేవిశ్రీ. ఈ సినిమాలో పాటలు అదిరిపోయాయని, తాను ఓ పాట చూశానని, వన్స్ మోర్ అనాలనిపించేలా ఈ పాటన్ని డిజైన్ చేశారని, పవన్ కూడా చాలా కాలం తరవాత స్టెప్పులేయాలన్న ఉత్సాహం చూపించారని చెప్పుకొచ్చాడు దేవి. బహుశా.. ఈ పాటలోనే పవన్ శ్రద్ధగా స్టెప్పులేశారేమో అనిపిస్తోంది. సాధారణంగా ఆల్బమ్ లోని ది బెస్ట్ సాంగ్ నే ఫస్ట్ సింగిల్ గా వదులుతుంటారు. ఈ ఆల్బమ్ లోని బెస్ట్ సాంగ్ కూడా ఇదే అనిపిస్తోంది. ఈనెల 13న పూర్తి పాట బయటకు రాబోతోంది. ఆ రోజు హైదరాబాద్ లో ఓ ఈవెంట్ నిర్వహించే ఛాన్స్ వుంది. మార్చిలో `ఉస్తాద్`ని రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు నిర్మాతలు.