తెలంగాణ శాసనసభలో జల వివాదాలపై మాట్లాడిన చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్, హరీష్ రావులపై వాడిన పదజాలాన్ని జాతీయ బీజేపీ ఖండించింది. బీజేపీ జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో రేవంత్ భాషను తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ పెట్టింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సభలో హుందాతనాన్ని పాటించాలన్నది ప్రధాన విమర్శ. రేవంత్ రెడ్డి వాడిన భాష వీధి పోరాటాలను” తలపిస్తోందని బీజేపీ తన ట్వీట్లో పేర్కొంది.
రేవంత్ రెడ్డి ప్రసంగ వీడియోను బీప్లతో పోస్ట్ చేసింది బీజేపీ. ఆయన మాటలు హిందీలోనే ఉన్నాయి. అత్యంత ఘోరమైన మాటల్ని మాట్లాడారన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు.. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ నవ్వుతూ ఉన్నారు. అయితే బీజేపీ ఈ ట్వీట్ చేయడానికి కారణం.. కేటీఆర్ పై సానుభూతి కాకుండా.. రేవంత్ ను చూపించి రాహుల్ ను నిందించేందుకు ఉపయోగించుకున్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో అనుసరించే వైఖరినే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అనుసరిస్తున్నారని, ఇది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని బీజేపీ విమర్శిస్తోంది.
బీజేపీ చేసిన ట్వీట్..రేవంత్ లాంగ్వేజ్ పై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు నైతిక బలం ఇస్తున్నట్లయింది. రేవంత్ రెడ్డి బీజేపీ నేతలపై ఎప్పుడూ అలాంటి భాష ప్రయోగించలేదు. కానీ కేసీఆర్,కేటీఆర్లపై మాత్రం ప్రయోగిస్తున్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాట తెలంగాణ సమాజంలో అత్యంత ఘోరమైన బూతుగా ప్రచారం జరుగుతూండటం.. హిందీలోనూ అదే అర్థం ఉండంటంతో.. వివాదాస్పదం అవుతోంది.


