బాండ్లు.. ఫ్లాట్లు..! అమరావతి అంటే హాట్ కేకులేనా..?

అమరావతి ఓ సేలబుల్ బ్రాండ్ గా మారిపోతోంది. కొద్ది రోజుల క్రితం.. స్టాక్ ఎక్సేంజ్ లో రూ. 1700 కోట్ల సేకరణకు బాండ్లు అమ్మకానికి పెడితే.. అరగంటలో రూ. 2 వేల కోట్లు వచ్చాయి. ఇప్పుడు సీఆర్డీఏ .. అపార్టుమెంట్లు కట్టి అమ్ముతామని ప్రకటించి.. బుకింగులు ప్రారంభించగానే… నిమిషాల్లోనే కొనేశారు. అమరావతిలోని నేలపాడు వద్ద 15 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన హ్యాపీనెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో ప్లాట్ ల బుకింగ్ కు దేశ విదేశాలలో ఉన్న తెలుగువారు విపరీతమైన ఆసక్తి చూపించారు. 50 వేల మంది ఒకేసారి సర్వర్ కు అనుసంధానమవుతారని అంచనా వేసి 100MBPS స్పీడుతో ఏర్పాటు చేసిన సర్వర్లు ఒకేసారి లక్షా 10వేల మంది అనుసంధానం కావడంతో యాక్సెస్ దొరకడం కష్టమయేంత డిమాండ్ వచ్చింది.

మొదటి ప్లాట్ ను బెంగుళూరులో ఉన్న యం.కృష్ణతేజ తొలి 42 సెకన్లకే బుక్ చశారు. రెండో ప్లాట్ ను గుంటూరుకు చెందిన యడ్లపాటి అమర్ నాధ్ 9గంటల03నిమిషాలకు బుక్ చేశారు. సర్వర్ కి యాక్సిస్ దొరకకపోవడంతో అనేకమంది సి.ఆర్.డి.ఎ కార్యాలయాలకు ఫోన్లు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల సమయాని కల్లా ప్లాట్లన్నీ బుక్ అయిపోయాయి. సి.ఆర్.డి.ఎ అమ్మకానికి ఉంచిన ప్లాట్లను విదేశాలలో ఉన్న వారు ఎక్కువుగా కొనుగోలు చేశారు. సీఆర్డీఏ ఆఫీసులు వచ్చి బుక్ చేసుకోవాలనుకున్న వారికి నిరాశే మిగిలింది. హెల్ప్ డెస్క్ లలో మూడు ఫ్లాట్లు మాత్రమే బుక్ చేయగలిగారు. మొత్తం ప్లాట్లు బుకింగ్ పూర్తి కావడంతో ఈ నెల 15వ తేదీన మరో మూడు వందల ప్లాట్లు బుకింగ్ కోసం ఉంచబోతున్నారు.

సాంకేతిక సమస్యలు లేకుండా ఈసారి యాక్సిస్ సులభంగా దొరికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సర్వర్ సామర్ధ్యాన్ని కూడా ఒకేసారి రెండు లక్షల మంది చూసేందుకు వీలుగా పెంచుతున్నారు. డిసెంబర్ నాటికి మొత్తం 1200 ప్లాట్ల బుకింగ్ ప్రక్రియను పూర్తి చేసి వెంటనే నిర్మాణం చేపడతామని, 24నెలల్లో నిర్మాణం పూర్తి చేసి అప్పగిస్తామని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇంత స్పందనను ఊహించలేకపోయామని సీఆర్డీఏ అధికారులు ఆనందంతో ఉన్నారు. చంద్రబాబుపై నమ్మకం వల్లే.. అమరావతికి ఇంత క్రేజ్ వచ్చిందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close