నిహారిక పెళ్లి ఎక్క‌డ?

మెగా ఇంట్లో త్వ‌ర‌లోనే పెళ్లి సంబ‌రాలు మొద‌ల‌వ్వ‌బోతున్నాయి. నాగ‌బాబు త‌న‌య నిహారిక‌కి చైత‌న్య‌తో పెళ్లి కుదిరిన సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌రులో పెళ్లి. క‌రోనా కాలం ఇది. సెల‌బ్రెటీల ఇళ్ల‌లో పెళ్లిళ్లు కూడా సింపుల్ గా జ‌రుగుతున్నాయి. నిహారిక పెళ్లి కూడా సింపుల్ గా చేయాల‌ని కుటుంబ స‌భ్యులు భావిస్తున్నారు. అయితే ఈసారి డిస్టినేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. నిహారిక పెళ్లి రాజ‌స్థాన్‌లో జ‌రిగే అవ‌కాశం ఉంది. పెళ్లి వేదిక‌ని త్వ‌ర‌లోనే ఖ‌రారు చేస్తామ‌ని నాగ‌బాబు చెప్పారు. “డిసెంబ‌రులో నిహారిక పెళ్లి జ‌రుగుతుంది. కొన్ని ప్రాంతాల్ని ఎంపిక చేశాం. అందులో ఒక‌చోటు ఖ‌రారు చేసి, త్వ‌ర‌లోనే చెబుతాం. పెళ్లి ఏర్పాట్ల‌న్నీ వ‌రుణ్‌తేజ్ చూసుకుంటున్నాడు” అని నాగ‌బాబు చెబుతున్నారు. గోవాలో నిహారిక పెళ్లి చేయాల‌ని ముందు అనుకున్నారు. కానీ.. ఇప్పుడు వేదిక రాజ‌స్థాన్‌కి మారింది. డిసెంబ‌రులో పెళ్లి అన్నారు గానీ, ముహూర్తం ఇంకా ఖ‌రారు కాలేదు. వేదిక‌తో పాటు, పెళ్లి ముహూర్తాన్ని త్వ‌ర‌లోనే ఫిక్స్ చేసి అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018...

ఎన్నికలు నిర్వహణ వద్దంటున్న వైకాపా

దేశంలో కరోనా లాక్ డౌన్ విధించినప్పుడు ఎన్నికలు వాయిదా వేశారని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కులం పేరు పెట్టి మరీ బూతులు తిట్టిన మంత్రులు ఇప్పుడు.. అదే రమేష్ కుమార్ ఎన్నికలు పెడతానంటే...

అమరావతిలో “రియల్ పెయిడ్ ఉద్యమం” స్టార్ట్..!

అమరావతిలో పోటీ ఉద్యమాలు జరుగుతున్నాయి. భూములిచ్చిన రైతులు లాఠీదెబ్బలకు ఓర్చుకుని పోరాటం చేస్తూంటే.. వారికి పోటీగా కొంత మంది ఇప్పుడు ఉద్యమాలను ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన చేసి ఐదేళ్లయిన సందర్భంగా రైతుల సభ...

తిరుపతిలో బీజేపీ పోటీ ఖాయం.. కానీ అభ్యర్థి మాత్రం పక్క పార్టీ నుంచి..!

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో పోటీ చేసి.. తాము ఏపీలో బలపడ్డామని నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉబలాట పడుతోంది. ముఖ్యంగా ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్‌గా ఉన్న సునీల్ ధియోధర్ తాను.. పార్టీని...

HOT NEWS

[X] Close
[X] Close