దర్శకుడు దేవా కట్టా డ్రీమ్ ప్రాజెక్ట్ మయసభ. ఇది పొలిటికల్‌గా సంచలనమైన కంటెంట్. మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ను ఆధారంగా చేసుకుని కొంత కల్పనను జోడించి ఈ కథను తయారు చేసుకున్నారు దేవకట్టా. మొదట సినిమాగా తీయాలనుకున్నారు. కానీ ఓటీటీ విస్తృతి కావడంతో ఈ కథను వెబ్ సిరీస్‌గా మలిచారు. ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది.
వైస్రాయ్ హోటల్ ఉదాంతంతో టీజర్ ప్రారంభమైంది. తర్వాత నాయుడు, రెడ్డి మధ్య ఒక ఆసక్తికరమైన ఫోన్ కాల్ చూపించారు. ఆ తర్వాత నాయుడు, రెడ్డి మధ్య ఫ్రెండ్షిప్ను చూపించే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను చూపించారు. ఇవి కాస్త ఫిక్షనల్ గానే ఉన్నాయి.
”రైతు కులం పుట్టిన నీకెందుకు అబ్బాయి రాజకీయం..” అని రెడ్డి పాత్ర అంటే..
”వసూళ్లు చేసిన కులంలో పుట్టిన రౌడీ వీ నీకెందుకయ్యా వైద్యం” అని నాయుడు పాత్ర బదులు ఇవ్వడం టీజర్‌కి కొసమెరుపు.
నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి కనిపిస్తే, రెడ్డి పాత్రలో చైతన్య రావు కనిపించారు. ఆ రెండు లుక్స్ కూడా ఫ్రెష్‌గా ఉన్నాయి.
దేవకట్టా డేరింగ్ ఫిల్మ్ మేకర్. ఇది నిజంగా సంచలనమైన కంటెంట్. చాలా ధైర్యంతోనే ఈ వెబ్ సిరీస్‌ను తయారు చేసినట్టుగా టీజర్ చూస్తే అర్థమవుతుంది.
చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్రెండ్షిప్ అనేది చాలా విలక్షణమైన కథాంశమే. మరి ఇందులో ఎలాంటి రాజకీయ కోణాలు ఉంటాయో చూడాలి.
ఆగస్టు 7 నుంచి ఈ వెబ్ సిరీస్ సోనీ లీవ్‌లో ప్రసారం కానుంది. కంటెంట్ అయితే పొలిటికలీ సెన్సిటివ్, సెన్సేషన్. మరి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ వెబ్ సిరీస్ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.