దేవ‌దాస్’ ట్రైల‌ర్‌: ఫ‌న్ & ఫ‌న్ & ఫ‌న్‌

ఇంత వ‌ర‌కూ కెమిస్ట్రీ అంటే హీరో, హీరోయిన్ల గురించే మాట్లాడుకునేవాళ్లం. ‘దేవ‌దాస్‌’ ట్రైల‌ర్ చూస్తే మాత్రం.. ఇద్ద‌రు హీరోల మ‌ధ్యన పుట్టిన కెమిస్ట్రీ గురించి కూడా మాట్లాడుకోవాల‌నిపిస్తుంది. ఆ ఇద్ద‌రే.. నాగార్జున‌, నాని. ఒక‌రు స్టైల్‌కి, మ‌రొక‌రు ఫ‌న్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌. ఇవి రెండూ జోడీ క‌డితే సూప‌రే. ఆ మ్యాజిక్ ‘దేవదాస్‌’ ట్రైల‌ర్లో క‌నిపించింది. నాగ్‌, నాని క‌థానాయ‌కులుగా న‌టించిన చిత్ర‌మిది. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కత్వం వ‌హించారు. అశ్వ‌నీద‌త్ నిర్మించారు. ఈనెల 27న సినిమా విడుద‌ల అవుతుంది. కొద్దిసేప‌టి క్రిత‌మే ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. నాగ్ ఓ డాన్‌గా, నాని ఓ డాక్ట‌ర్‌గా న‌టిస్తున్నార‌న్న సంగ‌తి ముందే అంద‌రికీ తెలిసిపోయింది. వాళ్లిద్ద‌రూ ఎందుకు క‌లిశారు? క‌లిశాక ఏం జ‌రిగింద‌న్న‌దే సినిమా. నానిని నాగ్ తెగ ఆడేసుకున్నాడ‌న్న విష‌యం ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. అమాయ‌క‌మైన ఓడాక్ట‌ర్‌, జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించే ఓ డాన్ మ‌ధ్య న‌డిచిన స‌న్నివేశాలు ఆధ్యంతం వినోదం పంచిపెట్టేలా ఉన్నాయి. నాగ్ స్టైల్‌గా క‌నిపిస్తుంటే, మ‌రోసారి నాని త‌న కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. ఆకాంక్ష సింగ్‌, ర‌ష్మిక గ్లామ‌ర్ ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతున్నాయి. వైజ‌యంతీ మూవీస్‌కి త‌గ్గ‌ట్టుగానే మేకింగ‌ఠ్ వాల్యూ క‌నిపిస్తోంది. మ‌ణిశ‌ర్మ బాణీలు క్లాస్‌గా ఉన్నాయి. మొత్తానికి రెండున్న‌ర గంట‌ల పాటు వినోదానికి ఎలాంటి ఢోకా లేద‌నిపిస్తోంది. నాగ్‌, నాని అభిమానుల‌కు అదే క‌దా కావాల్సింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com