ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘దేవర 2’కి సంబంధించిన ఓ అప్ డేట్ ఈరోజే బయటకు వచ్చింది. ‘మే నుంచి దేవర షూటింగ్’ అంటూ స్వయంగా నిర్మాతే ప్రకటించేశారు. ఈ విషయంలో ఫ్యాన్స్ హ్యాపీ. కానీ.. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఎన్నో డౌట్లు ఉన్నాయి.
నిజానికి ‘దేవర 2’పై ఎన్టీఆర్ కు ఎలాంటి ఆసక్తీ లేదని ముందు నుంచీ గట్టిగా ప్రచారం జరుగుతోంది. నిజంగానే ‘దేవర 2’ చేయాలి అనుకొంటే ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లిపోయేది. ఇంత కాలం ఆగేది కాదు. కొరటాల శివ ఓ వెర్షన్ తయారు చేశారు. కానీ అది ఎన్టీఆర్ కి నచ్చలేదని టాక్. ఎన్టీఆర్ – కొరటాల మధ్య పలు దఫాలుగా డిస్కర్షన్స్ నడిచాయి. కానీ విషయం తేలలేదు. దాంతో.. ప్రాజెక్ట్ పక్కన పెట్టారు. ఆ తరవాత త్రివిక్రమ్ లైన్ లోకి వచ్చారు. డ్రాగన్అవ్వగానే త్రివిక్రమ్ సినిమా అనుకొన్నారు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ దాదాపుగా లేనట్టే. దాంతో.. ఆ స్లాట్ ఖాళీ అయిపోయింది. దాంతో అర్జెంటుగా ఆ గ్యాప్ లో సినిమా చేయాలన్న ఆలోచన ఎన్టీఆర్‌కి వచ్చింది. అలా కొరటాల శివకు పిలుపు వచ్చింది.
కొరటాల శివ ప్రస్తుతం ‘దేవర 2’ స్క్రిప్టు విషయంలో తలమునకలై ఉన్నారన్నది వాస్తవం. కానీ.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలంటే కొన్ని సమీకరణాలు సెట్ అవ్వాలి. ముందు ఈ స్క్రిప్టు ఎన్టీఆర్‌కి నచ్చాలి. తొలి వెర్షన్ కంటే బెటర్ అనుకోవాలి. ప్రస్తుతం ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది. వాళ్లకు చిన్న.. చితకా కథలు ఎక్కడం లేదు. మామూలు ఎలివేషన్లు సరిపోవడం లేదు. వాటికి మ్యాచ్ అయ్యేలా సీన్స్ రావాలి. దాంతో పాటు ‘డ్రాగన్’ కూడా అనుకొన్న సమయంలో పూర్తి కావాలి. వీటిలో ఏది జరక్కపోయినా ‘దేవర 2’ డౌటే. ఈలోగా మరో దర్శకుడు, మరో కథతో.. ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి సెట్ చేసుకోగలిగితే.. ఆ స్లాట్.. ఆ దర్శకుడికి వెళ్లిపోతుంది. ఇలా ‘దేవర 2’ విషయంలో చాలా అడ్డంకులు ఉన్నాయి. ప్రస్తుతానికైతే.. ఎన్టీఆర్ ముందున్న ఈజీ ఆప్షన్ కొరటాల శివ. అందుకే.. ఎన్టీఆర్ నుంచి పిలుపు వెళ్లింది. ఈ ఛాన్స్ కొరటాల ఎంత వరకూ నిలబెట్టుకొంటాడో చూడాలి.
