వింటేజ్ చిరంజీవిని మిస్ చేసుకున్న దేవిశ్రీ

స్వరం గొప్పదా ? సాహిత్యం గొప్పదా ?… రెండూ గొప్పవే. సాహిత్యం నుండే సంగీతం పుడుతుందని సంగీతకారుడు.. సంగీతమే సాహిత్యానికి స్ఫూర్తని సాహిత్యకారుడు పరస్పరం గౌరవించుకుంటారు. నిజం కూడా అదే. ఈ రెండిటిలో ఏది బాగాలేకపోయినా పాట నిలబడదు. ఒక మంచి ట్యూన్ చేసిన తర్వాత దీనికి మరింత మంచి సాహిత్యం వుండాలని సంగీత దర్శకుడు ఆశపడతాడు. అయితే మారిన పరిస్థితుల ప్రభావం ఏమిటో కానీ.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వరుస మాత్రం దీనికి భిన్నంగా వుంది. దేవిశ్రీ సంగీతంలో తయారౌతున్న ‘వాల్తేరు వీరయ్య ‘ఆల్బమ్ ఇందుకు నిదర్శనం.

ఫస్ట్ సాంగ్ బాస్ పార్టీ పాట విని అందరూ షాక్ అయ్యారు. చిరంజీవి పాట అంటే ద్రుష్టి అంతా చిరంజీవి పై వుంటుంది. కానీ బాస్ పార్టీ పాట మాత్రం వెరైటీ. అందరూ దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ గురించి చాలా వెటకారంగా మాట్లాడారు. దారుణంగా ట్రోల్ చేశారు. కారణం.,.దేవిశ్రీ రాసిన లిరిక్స్ అలా వున్నాయి. పదాలు ట్యూన్ లో సరిగ్గా కూర్చోలేదు. పాటంతా అతుకుల బొంతలా తయారైయింది.

ఇప్పుడు రెండో పాట ‘నువ్వు శ్రీదేవి.. నేను చిరంజీవి’ వచ్చింది. ఈ పాట చూసిన తర్వాత వీరయ్య ఆల్బమ్ ని మేకర్స్ లైట్ తీసుకున్నారా ? అనిపిస్తోంది. ట్యూన్ , బీట్ బావున్నాయి. దేవిశ్రీ పాత పాటలని గుర్తు చేసిన్సప్పటికీ .. ఓకే అనిపించింది. లొకేషన్ కూడా అదిరిపోయింది. అయితే ఈ ట్యూన్ కి లిరిక్స్ కి లొకేషన్ కి సింక్ కుదరలేదు. లిరిక్స్ లో ఎక్కడా నవ్యత లేదు. ‘వావ్’ అనుకునే ఎక్స్ ప్రెషన్ లేదు.

ఈ పాట కోసం యూరప్ వెళ్లి పూర్తిగా మంచుతో కప్పపడిన లొకేషన్ తో షూట్ చేశారు. తీరా ట్యూన్, లిరిక్స్ వింటే.. ”ఈ పాట కోసం అంతదూరం ఎందుకు.. ఏ స్టూడియో లోనో నాలుగు కలర్ ఫుల్ లైట్లతో లాగించేయోచ్చు’ కదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. లిరిక్స్, ట్యూన్ విడివిడిగా వినిపిస్తున్నాయి. ట్యూన్ లో పదాలు ఫిట్ చేయడానికి దేవిశ్రీకున్న పద సంపద సరిపోలేదని క్లియర్ గా అర్ధమౌతుంది. తొలి పాట ఐటెం నెంబర్ .. దేవిశ్రీతో సరదా రాయించేశారని అనుకున్నారంతా. కానీ రెండో పాట దేవిశ్రీ తోనే రాయించడం చూస్తుంటే.. తెలుగులో లిరిక్ రైటర్స్ కి అంత కొరత వచ్చేసిందా ? అనిపిస్తోంది.

మెలోడికి డ్యాన్స్ చేయడం చిరంజీవి ట్రెండ్ సెట్టర్. వీణ పలికించిన గమకాలని సైతం తన బాడీ లాంగ్వేజ్ తో పట్టుకొని ప్రేక్షకుడు ఎప్పటికీ మర్చిపోలేని సిగ్నేచర్ స్టెప్స్ తో అలరించిన గొప్ప డ్యాన్సర్. ఈ పాటలో ఆ లొకేషన్ చూస్తే.. చిలుకా క్షేమమా,, హిమసీమల్లో, సిగ్గుతో చి చి.. లాంటి వింటేజ్ మెలోడితో ఆకట్టుకునే అవకాశం లభించింది. కానీ దేవిశ్రీ మాత్రం.. ‘రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు’ అంటూ తన రొటీన్ బీట్ తో సరిపెట్టేశాడు. వీరయ్యలో వింటేజ్ చిరంజీవిని చూపించాలనేది దర్శకుడు బాబీ ప్రయత్నం. ఈ యూరప్ లొకేషన్ లో చిరంజీవి వింటేజ్ మెలోడిని చూపించే అవకాశం వచ్చింది. కానీ ఈ ఛాన్స్ ని చేతులారా మిస్ చేసుకుంది వీరయ్య టీమ్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close