లిక్కర్ స్కామ్లో నిందితులు ముగ్గురికి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ పత్రాలు సమర్పించడం ఆలస్యం కావడంతో శనివారం విడుదల కాలేదు. ఆదివారం విడుదల చేయరేమో అని కంగారు పడ్డారు. ప్రొసీజర్ పూర్తి చేయడానికి కాస్త సమయం తీసుకునే సరికి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు భయంతో కూడిన కోపం వచ్చింది. తమ బెయిల్ ను ఆపడానికి హైకోర్టుకు వెళ్లారేమోనని అనుకున్నారు. అంతే రెచ్చిపోయారు. చివరికి వదిలి పెట్టిన తర్వాత జైలు బయట మీడియా ముందు తమ భయంతో కూడిన కోపాన్ని వెళ్లగక్కారు.
చట్టం, న్యాయం లేవట.. కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే రిలీద్ చేయకుండా ఆపారట. హైకోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకునేందుకు ప్రయత్నించేందుకు..తమను జైల్లోనే ఉంచేందుకు ఇలా చేశారని వారనుకుంటున్నారు. ధనుంజయ్ రెడ్డి ఆవేశం చూసి మీడియా ప్రతినిధులకు కూడా ఆశ్చర్యం వేసింది. సరైన పత్రాలు సమర్పించినా ఆదివారం విడుదల చేయరు. కానీ చేశారు. అయినా గంట ఆలస్యం చేసినట్లుగా .. చట్టం, న్యాయం గురించి మాట్లాడేస్తున్నారు.
ఈ ధనుంజయ్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు సీఎంవోలో చక్రం తిప్పారు. జగన్ రెడ్డి చేసిన అన్ని నిర్వాకాలకు వంత పాడారాన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ధనుంజయ్ రెడ్డి వల్లే ఓడిపోయామని వైసీపీ నేతలు చాలా సార్లు ఆరోపించారు. అయినా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈయనపై చాలా అభిమానం ఉంది. కానీ జైలుకు వచ్చి మాత్రం పరామర్శించలేదు.