ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజులపాటు ఈ ఇద్దరిని ప్రశ్నించిన అధికారులు తాజాగా అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో వీరిని హాజరు పరచనున్నారు.
ఈ కేసులో అరెస్ట్ ఖాయమని భావించిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ నిరాశే ఎదురైంది. కేసు కీలక దశలో ఉండగా ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో వారికి అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఉన్న మార్గం మూసుకుపోయినట్లు అయింది.
ఇదిలా ఉండగా విచారణలో భాగంగా మూడో రోజు సిట్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో కింగ్ పిన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుండటంతో వచ్చే వారం రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.