ధ‌నుష్ – ఐశ్వ‌ర్య‌.. ఏక్ ఛోటీసీ ల‌వ్ స్టోరీ

ధ‌నుష్ – ఐశ్వ‌ర్య విడిపోవ‌డం చిత్ర‌సీమ‌కు పెద్ద షాక్‌. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ అన్యోన్యంగా క‌నిపించిన ఈ జంట‌… స‌డ‌న్ గా ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకుందా? అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ, ధ‌నుష్ ఫ్యాన్స్‌కి అయితే ఇది ఊహించ‌ని ప‌రిణామం. అయితే.. ఇది ప‌ర‌స్ప‌ర అంగీకారంతో తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని, త‌మ అభిప్రాయాన్ని గౌర‌వించాల‌ని ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య కోరుతున్నారు. వాళ్ల జీవితంలో ఇదో కీల‌క‌మైన నిర్ణ‌యం. ప‌ద్దెనిమిదేళ్ల బంధానికి తెర దించ‌డం ఏ జంట‌కైనా స‌వాలే. సంక్లిష్ట‌మైన నిర్ణ‌య‌మే.

ర‌జ‌నీకాంత్ కి ధ‌నుష్ అల్లుడ‌వ్వ‌డం అప్ప‌ట్లో ఇలానే అంద‌రినీ షాక్ కి గురి చేసింది. అప్ప‌టికి ధ‌నుష్ పెద్ద స్టారేం కాదు. అయినా.. ర‌జ‌నీ త‌న అల్లుడ్ని చేసుకున్నాడు. దాంతో…. ధ‌నుష్ అదృష్టానికి అంద‌రూ కుళ్లుకున్నారు. ఇప్పుడు స‌డ‌న్ గా విడాకులు తీసుకుని.. వాళ్ల‌ని సైతం ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు ధ‌నుష్‌.

ధ‌నుష్ – ఐశ్వ‌ర్య‌ల‌ది ప్రేమ వివాహ‌మే. అయితే ఆ ప్రేమ క‌థ కూడా సినిమాటిక్ గానే మొద‌లైంది. ధ‌నుష్ న‌టించిన `కాద‌ల్ కొండెన్‌` సినిమాని థియేట‌ర్లో చూసింది ఐశ్వ‌ర్య‌. ధ‌నుష్ న‌ట‌న న‌చ్చి.. ధ‌నుష్ ఇంటికి ఓ బొకే పంపించింది. `ట‌చ్‌లో ఉండు…`అని సందేశంతో. ఆ సందేశం.. ధ‌నుష్ కి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింద‌ట‌. సూప‌ర్ స్టార్ కూతురు..`ట‌చ్‌లో ఉండు` అని చెప్ప‌డంతో.. ధ‌నుష్ ఫిదా అయిపోయాడు. అక్క‌డి నుంచి.. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం మొద‌లైంది. ధ‌నుష్ – ఐశ్వ‌ర్య‌లు క్లోజ్‌గా ఉండడం గ‌మ‌నించిన త‌మిళ మీడియా… వాళ్ల‌పై ఫోక‌స్ చేసింది. ప్రేమ ప‌క్షులు అంటూ క‌థ‌నాలు అల్లింది. నిజానికి అప్ప‌టికి వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ది ప్రేమ అనే సంగ‌తి వారిద్ద‌రికీ తెలీద‌ట‌. మీడియా క‌థ‌నాల్ని వాళ్లూ పాజిటీవ్‌గా తీసుకున్నారు.

ధ‌నుష్ కంటే ఐశ్వ‌ర్య రెండేళ్లు పెద్ద‌. అయినా వీరి ప్రేమ‌కు అది అడ్డు కాలేదు. త‌మ ప్రేమ వ్య‌వ‌హారాన్ని ముందు ర‌జ‌నీ ముందే ఉంచారు. ర‌జ‌నీ సానుకూలంగా స్పందించ‌డంతో.. పెద్ద‌లంతా ఒక్క‌టై 2004లో వీరిద్ద‌రి పెళ్లి చేశారు. ఈ జంట‌కు ఇద్ద‌రు అబ్బాయిలు. ధ‌నుష్ కెరీర్‌లో ఐశ్వ‌ర్య ప్ర‌మేయం చాలా ఉంది. క‌థ‌ల ఎంపిక‌, కాస్ట్యూమ్స్ ఇవ‌న్నీ ఐశ్వ‌ర్య ద‌గ్గ‌రుండి చూసుకునేది. ఇప్పుడు ఈ బంధానికి బీట‌లు వారాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌తో అఖిలేష్ భేటీ.. ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ !

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఢిల్లీలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ సమావేశం అయ్యారు. జాతీయ రాజకీయాలపై కీలక చర్చల కోసం ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ ను కలుసుకునేందుకు అఖిలేష్ ప్రత్యేకంగా...

వైసీపీ ఎమ్మెల్సీ అయితే “మర్డర్” కేసులోనూ మినహాయింపులేనా !?

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య కేసు నమోదు విషయంలో పోలీసులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తూండటం వివాదాస్పదమవుతోంది. అసలేమీ జరగకపోయినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే పోలీసులు ఇక్కడ స్వయంగా హత్య జరిగినట్లుగా...

ఫిల్మీ ఫెస్టివ‌ల్‌: ఈ సంక్రాంతికి ఆరు సినిమాలా?

2022 సంక్రాంతి చ‌ప్ప‌గా సాగిపోయింది. పెద్ద సినిమాలులేక‌పోవ‌డం, వ‌చ్చిన సినిమాలు ఆడ‌క‌పోవడంతో సంక్రాంతి శోభే లేదు. అయితే 2023 ఇలా కాదు. పెద్ద సినిమాలు ఈసారి హోరెత్తించ‌బోతున్నాయి. బాక్సాఫీసుకి కొత్త క‌ళ తీసుకురాబోతున్నాయి....

కోనసీమలో చిచ్చు పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం ఇప్పుడు ఆ జిల్లాలో ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. జిల్లాకు పేరు మార్చమని గతంలో ఉద్యమం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా పేరు మారుస్తూ జీవో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close