విద్యావ్య‌వ‌స్థ‌పై ధ‌నుష్ తిరుగుబాటు

ఈమధ్య టాలీవుడ్ పై గ‌ట్టిగా ఫోక‌స్ పెట్టాడు ధ‌నుష్‌. తెలుగులో నేరుగా ఓ సినిమా చేస్తున్నాడు. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడు. ఆ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిందో.. లేదో మ‌రో సినిమాకి అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌తో ధ‌నుష్ ఓ సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశాడు. తొలిప్రేమ‌, రంగ్ దే చిత్రాల ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ధ‌నుష్ కోసం ఓ క‌థ త‌యారుచేశాడు. ఇటీవ‌ల ధ‌నుష్ తో వెంకీ అట్లూరి ములాఖాత్ జ‌రిగింది. క‌థ కూడా ఓకే అయిపోయింది.

వెంకీ అట్లూరి ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన సినిమాల‌న్నీ ప్రేమ‌క‌థ‌లే. అయితే.. ధ‌నుష్ కోసం మ‌రో కొత్త క‌థ‌ని ఎంచుకున్నాడ‌ట‌. ఈసారి విద్యావ్య‌వ‌స్థ నేప‌థ్యంలో క‌థ సాగ‌బోతోంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుత విద్యావ్య‌వ‌స్థ‌లోని లోపాల్ని ఎత్తి చూపే విధంగా ఈ క‌థ ఉంటుంద‌ని, ధ‌నుష్ పాత్ర సీరియ‌స్ ఎమోష‌న్‌తో సాగ‌బోతోంద‌ని తెలుస్తోంది. తెలుగు, త‌మిళంతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు. అంటే.. ధ‌నుష్ చేయ‌బోయే మ‌రో పాన్ ఇండియా సినిమా ఇద‌న్న‌మాట‌. వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close