ధ‌నుష్ క‌థ‌… సిద్దు ద‌గ్గ‌ర‌కు!

‘డీజే టిల్లు’తో స్టార్ డ‌మ్ సంపాదించుకొన్నాడు… సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌. ‘టిల్లు స్క్వేర్‌’ సూపర్ హిట్ కొట్ట‌డంతో… త‌న పాపులారిటీ మ‌రింత పెరిగింది. ఇప్పుడు అంద‌రి దృష్టీ.. ‘టిల్లూ క్యూబ్‌’పై ఉంది. ఈలోగా సిద్దు జొన్న‌ల గ‌డ్డ నుంచి మ‌రో సినిమా వ‌స్తోంది. అదే.. ‘జాక్‌’. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉంది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌ది డిఫ‌రెంట్ స్టైల్‌. సిద్దూ బాడీ లాంగ్వేజ్ వేరు. వీరిద్ద‌రికీ ఎలా సెట్ అవుతుందా.. అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం తెలిసింది. నిజానికి ‘జాక్‌’ క‌థ‌… సిద్దుని దృష్టిలో ఉంచుకొని రాయ‌లేదు. ఈ క‌థ‌కు ముందు అనుకొన్న హీరో ధ‌నుష్‌. త‌న‌తో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఓ సినిమా చేద్దామ‌నుకొన్నాడు. ఈ క‌థ ప‌ట్టుకొని ధ‌నుష్ చుట్టూ తిరిగాడు. ధ‌నుష్‌కి కూడా ఈ క‌థ న‌చ్చింది. అయితే ఎందుకో మ‌రి ఈక్వేష‌న్స్ కుద‌ర్లేదు. ఆ త‌ర‌వాతే.. ఈ క‌థ సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. సిద్దు, ధ‌నుష్ వీరిద్ద‌రి ఇమేజ్‌లు వేరు. ధ‌నుష్ కోసం రాసిన క‌థ‌ని.. సిద్దు కోసం ఎలా మ్యాచ్ చేశాడో? బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌పై ఓర‌క‌మైన ఇమేజ్ ఉంది. క్లీన్ సినిమాలు తీస్తాడ‌ని పేరు తెచ్చుకొన్నాడు. ఈ సినిమా ఆ ఇమేజ్‌కు కూడా దూరంగా ఉండ‌బోతోంద‌ని టాక్‌. సిద్దు సినిమా అంటే ఇప్పుడు లిప్ లాక్‌లు కామ‌న్ అయిపోయాయి. అలాంటి హాట్ దృశ్యాలు ‘జాక్‌’లో చాలా ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close