నిజామాబాద్ ఎంపీకి పసుపు గండం..!

నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవితపై గెలుపొందిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌కు అప్పుడే సెగ ప్రారంభమయింది. ఎంపీ అరవింద్ గెలవడానికి ప్రధాన కారణం పసుపు బోర్డు. నిజామాబాద్‌లోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల్లో పసుపు రైతులు ఆ సమయంలో భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అంతకు ముందు ఎంపీగా ఉన్న కవిత పసుపుబోర్డు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. కానీ బీజేపీ సర్కార్ ఇవ్వలేదు. అదే హామీని అరవింద్ ఇచ్చారు. ఆయన ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. బాండ్ పేపర్లు రాసిచ్చారు. దాంతో రైతులు ఆయనకు ఏకపక్షంగా మద్దతు పలికారు. ఆ విషంయ పోలింగ్ సరళిలో తేలింది. ఆ సమయంలో ఎన్నికల బరిలో కూడా… కొన్ని వందల మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి పోటీకి నిలిచారు. రైతు దెబ్బకు కవిత ఓడిపోయారు.

అరవింద్ గెలిచారు. గెలిచినప్పటి నుండి పసుపు బోర్డు కోసం రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ పసుపు బోర్డు కాకుండా.. స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని అరవింద్ తీసుకు వచ్చారు. అయితే ఇది రైతుల్ని సంతృప్తి పరచలేదు. పసుపుబోర్డుపై ఆయన ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. తాజాగా రైతులు మళ్లీ నిరసనలకు దిగారు. దీంతో రైతులతో సమావేశమై.. వారిని కన్విన్స్ చేసేందుకు అర్వింద్ ప్రయత్నిస్తున్నారు. ఇలా జరిగిన ఓ సమావేశంలో రైతులు ఆయనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, రూ.15 వేలు మద్దతు ధర ఇప్పిస్తానని..నేను ఎక్కడా చెప్పలేదని ధర్మపురి అర్వింద్ ఎదురుదాడికి దిగారు.

పసుపు బోర్డు తెస్తానని మాత్రమే చెప్పానన్నారు. పసుపు ధరకు మద్దతు ధర కోసం మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. నిర్ణయం తీసుకోవాల్సింది మీరేనని కూడా తేల్చేశారు. దీంతో రైతులు అసంతృప్తికి గురయ్యారు. డౌన్ డౌన్ నినాదాలు చేశారు. బీజేపీలో యువ నేతల్లో ధాటిగా ఎదుగుతున్న అరవింద్‌కు పసుపుబోర్డు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎలాగోలా పసుపుబోర్డు ఏర్పాటు చేయించకపోతే.. రాజకీయంగా కూడా ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో తిరుగుబాటు వార్తలు..! సజ్జల వివరణ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అంటూ రిపబ్లిక్ టీవీలో వచ్చిన ఓ కథనం ఇప్పుడు వైసీపీలో అలజడి రేపుతోంది. ఎంతగా అంటే.. ఆ పార్టీకి జగన్ తర్వాత జగన్ అంతటి వ్యక్తిగా బరువు,...

స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగదని కేంద్రంతో చెప్పించిన వైసీపీ ఎంపీలు..!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తమ వద్ద ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని చెబుతున్న వైసీపీ నేతలు... ఢిల్లీ నుంచి మాత్రం ఏపీకి స్టీల్ ప్లాంట్‌తో సంబంధం లేదనే ప్రకటనలు...

తెలంగాణ మహిళల గురించి సరే….షర్మిల తన హక్కుల కోసం ఎలా పోరాడుతారు..!?

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి.. రాజన్న రాజ్యం తీసుకు వచ్చి.. అందరికీ న్యాయం చేసేయాలన్న పట్టుదలతో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా ఉపయోగించుకున్నారు. పెద్ద...

చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నారంటున్న సజ్జల..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాలు కానీ.. రాజకీయ విమర్శలు కానీ బూతుల రేంజ్‌లో ఎవరు చేస్తారు..? అంటే ప్రత్యేకంగా సమాధానం వెదుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే అదే వైసీపీ నేతలు ఇప్పుడు.. చంద్రబాబు, లోకేష్...

HOT NEWS

[X] Close
[X] Close