కృష్ణ‌, కృష్ణంరాజుల‌కూ ఆహ్వానం అందిందా?

భీమ‌వ‌రంలో మోదీ స‌భ విజ‌య‌వంతంగా ముగిసింది. ఈ స‌భ‌కు చిరంజీవిని ఆహ్వానించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చిరుకి ఆహ్వానం అంద‌డం వెనుక బ‌ల‌మైన స‌మీక‌ర‌ణాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే.. ఈ వేడుక‌కు కృష్ణ లాంటి దిగ్గ‌జాల‌ను పిల‌వ‌క‌పోవ‌డం ఏమిట‌న్న‌ది ఇంకొంద‌రి ప్ర‌శ్న‌. అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా.. వెండి తెర‌పై ఆ పాత్ర‌ని అద్భుతంగా పోషించిన కృష్ణ‌ని ఆహ్వానిస్తే బాగుండేద‌ని చెప్పుకుంటున్నారు. నిజానికి కృష్ణ‌కు ఈ వేడుక‌కు ర‌మ్మ‌ని ఆహ్వానం అందిన‌ట్టు స‌మాచారం. కృష్ణ‌తో పాటుగా కృష్ణంరాజునీ పిలిచార‌ని స‌మాచారం. కృష్ణంరాజు ముందు నుంచీ బీజేపీ మ‌నిషి. పైగా భీమ‌వ‌రంలో ఆయ‌న సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంది. అయితే ఆరోగ్య కార‌ణాల వ‌ల్ల‌.. వీరిద్దరూ ఈ స‌భ‌కు హాజ‌ర‌వు అవ్వ‌లేద‌ని తెలుస్తోంది. కృష్ణ ఇప్పుడు ఇదివ‌ర‌క‌టిలా ఉత్సాహంగా లేరు. వ‌య‌సు మీద ప‌డుతోంది. ఆయ‌న లేచి న‌డ‌వ‌లేని ప‌రిస్థితి. ఇలాంట‌ప్పుడు అంత పెద్ద క్రౌడ్‌లో జ‌రిగే వేడుక‌కి వెళ్ల‌డం అంత మంచిది కాదు కూడా. కృష్ణంరాజుదీ ఇదే ప‌రిస్థితి. ఇటీవ‌లే ఆయ‌న‌కు ఆప‌రేష‌న్ జ‌రిగింది. ఆయ‌న కూడా చ‌క్రాల కుర్చీకే ప‌రిమిత‌మ‌య్యాడు. అందుకే.. కృష్ణంరాజు కూడా వెళ్ల‌లేద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డిస్నీప్లస్ హాట్ స్టార్ లో “వారియర్” సంచలనం!!

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఆడియన్స్ ని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఉర్రూతలూగిస్తోంది. దాని పేరు "వారియర్". ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెండు క్యారక్టర్లతో సంచలనం సృష్టించారు. హీరో...

పది లక్షల పెన్షన్లు సరే – డబ్బులెక్కడివి !?

కేంద్రం సహకరించండం లేదు. ఖర్చులకు తగ్గట్లుగా రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు. ఆదాయం ఎలా తెచ్చుకోవాలి అన్న ఎజెండాగా కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. ఐదు...

ఎడిటర్స్ కామెంట్స్ : దేశభక్తి రాజకీయ సరుకు కాదు !

"దేశభక్తి అనేది జెండా ఊపడంలో కాదు, మన దేశం ధర్మబద్ధంగా మరియు బలంగా ఉండాలని ప్రయత్నించడంలో ఉంటుంది." .. నూట యాభై ఏళ్ల కిందట బ్రిటన్‌కు చెందిన జేమ్స్ బ్రిస్ అనే పెద్దాయన...

పాలాభిషేకాలకు మరో ఫార్ములా కనిపెట్టిన ఏపీ సర్కార్ !

కార్పొరేషన్లు పెట్టి బీసీ , ఎస్సీ, ఎస్టీ, కాపు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య సహా అన్ని కులాలకు పైసా సాయం చేయకపోగా.. అందరికీ ఇస్తున్న పథకాలు లెక్కలు చెబుతూ బురిడీ కొట్టిస్తున్న వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close