క్లైమాక్స్‌పై ఆశ‌లు పెట్టుకున్న ‘మ‌హ‌ర్షి’

ఏ సినిమాకైనా హై మూమెంట్స్ నాలుగో అయిదో ఉంటాయి. ఎంత పెద్ద సూప‌ర్ హిట్ సినిమా అయినా తీసుకోండి.. అయిదారు ఎసిపోడ్స్ క్లిక్ అయితే చాలు అనుకుంటారు. కొంత‌మంది ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌పై న‌మ్మ‌కం పెట్టుకుంటారు. ఇంకొంత‌మంది క్లైమాక్స్ పై ఆధార‌ప‌డిపోతుంటారు. ‘మ‌హ‌ర్షి’ ప్రాణం అంతా ఆ క్లైమాక్స్ ద‌గ్గ‌రే ఉంది. అందుకే ప‌తాక స‌న్నివేశాల‌పై గంపెడు ఆశ‌లు పెట్టుకుంది చిత్ర‌బృందం. ఈ సినిమా కోసం ఎమోష‌న‌ల్ క్లైమాక్స్ డిజైన్ చేశాడు వంశీ పైడిప‌ల్లి. అది చూస్తే ఎవ్వ‌రికైనా క‌న్నీళ్లు ఆగ‌వ‌ట‌. ఈ విష‌యాన్ని దిల్‌రాజునే చెప్పాడు.

దాంతో పాటు అల్ల‌రి న‌రేష్ పాత్ర‌పైనా చాలా హోప్స్ ఉన్నాయి. ఈ పాత్ర ఏ మేర‌కు పండుతుంది? ఏ స్థాయిలో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నాటుకుపోతుంది అనేదాన్ని బ‌ట్టి మ‌హ‌ర్షి సినిమా జ‌యాప‌జ‌యాలు ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఆ పాత్ర‌ని ముందు నుంచీ హైడ్ చేస్తూనే వ‌స్తోంది చిత్ర‌బృందం. స్క్రీన్ పై ఆ పాత్ర చూసి షాక్ అవ్వాల‌న్న‌ది వాళ్ల ఉద్దేశం. న‌రేష్ పాత్ర‌కు యాంటీ క్లైమాక్స్ డిజైన్ చేశార‌ని, క‌థానాయ‌కుడి పాత్ర‌లో మార్పు అక్క‌డి నుంచే మొద‌ల‌వుతుందని, ఆ పాత్ర‌… ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంద‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మ‌హ‌ర్షి బ‌లం.. న‌రేష్‌, క్లైమాక్స్ సీన్ అని తేలిపోయింది. మ‌రి ఇవి రెండూ ఈ సినిమాని ఏ మేర‌కు గ‌ట్టెక్కిస్తాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“జై అమరావతి” అంటే బీజేపీలో సస్పెన్షనే..!

అమరావతి రైతుల కోసం పోరాడతామని భారతీయ జనతా పార్టీ ఓ వైపు చెబుతోంది. ఆ రైతులకు మద్దతు చెప్పేందుకు వెళ్లిన నేతలపై మాత్రం సస్పెన్షన్ల వేటు వేస్తోంది. గతంలో అమరావతికి మద్దతుగా ఓ...

మోడీకి జగన్ అభినందనలు..!

నిజమే.. మీరు కరెక్ట్‌గానే చదివారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి జగన్ అభినందనలు తెలిపారు. మోడీ ఆ అభినందులు రిసీవ్ చేసుకుని .. జగన్ అభినందించినందుకు పొంగిపోయారో లేదో తెలియదు కానీ.. మోడీని జగన్ అభినందించిన...

క్రైమ్ : ఒకరిది ఆత్మహత్య…మరొకరిది హత్య..! ఇద్దరు తండ్రుల కథ..!

వారిద్దరూ ఆడపిల్లల తల్లిదండ్రులు. కని పెంచి.. అల్లారుముద్దుగా పెంచి.. తమకు చేతనయినంతలో మంచోళ్లు అనుకునే వాళ్లకే కట్టబెట్టారు. కానీ వారు అనుకున్నంత మంచోళ్లు కాదు. ఆ విషయం తెలిసి తమ కూతుళ్లు జీవితాలు...

ఐవైఆర్ కూడా అమరావతినే ఉంచమంటున్నారు..!

వారం రోజులు ఆలస్యంగా తన పెన్షన్ వచ్చిందని... మూడు రోజులుగా ఐవైఆర్ కృష్ణారావు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. ఆయన రోజువారీగా... ఏం చేయాలన్నదానిపై ముఖ్యమంత్రి జగన్‌కు సలహాలిస్తూ ట్వీట్లు చేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close