తొలిసారి ‘గీత’ దాటిన దిల్ రాజు

దిల్ రాజు సినిమాల‌న్నీ క్లీన్‌గా ఉంటాయి. సకుటుంబ స‌ప‌రివార స‌మేతంగా చూడ‌ద‌గిన సినిమాలే తీస్తారాయ‌న‌. అందుకే దిల్ రాజు సినిమా అంటే ఓ బ్రాండ్ ప‌డిపోయింది. అయితే తొలిసారి ఆయ‌న గీత దాటారు. ఇది ఇంకెవ‌రో చెబుతున్న విష‌యం కాదు. ఆయ‌న‌కి ఆయ‌నే ప్ర‌క‌టించుకున్నారు.

దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి ‘రౌడీ బాయ్స్‌’ సినిమా వ‌స్తోంది. ఈనెల 14న ఈ సినిమా విడుద‌ల అవుతోంది. సంక్రాంతి సీజ‌న్‌లో దిల్ రాజు సినిమా రావ‌డం కొత్తేం కాదు. ఇది ఆరోసారి. గ‌తంలో వ‌చ్చిన సినిమాల‌న్నీ హిట్టే. ‘రౌడీ బాయ్స్‌’తో డ‌బుల్ హ్యాట్రిక్ కొడ‌తా అని న‌మ్మ‌కంగా చెబుతున్నారాయ‌న‌. ఇదో యూత్ ఫుల్ సినిమా అని, 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల‌లోపు యువ‌త‌కు ఈ సినిమా పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేస్తుంద‌ని, త‌న‌ది గ్యారెంటీ అని బ‌ల్ల‌గుద్ది చెప్పారు. అంతే కాదు..’మా సినిమాల‌న్నీ ప‌ద్ద‌తిగా ఉంటాయి. అయితే సెన్సార్ వాళ్లు ఈ సినిమా చూసి ‘ఇది మీ సినిమానేనా ‘ అని అడిగారు. ఈ సినిమా కోసం తొలిసారి స‌రిహ‌ద్దు దాటాల్సివ‌చ్చింది. అది కూడా మా అబ్బాయి ఆశిష్ కోసం“ అని డిక్లేర్ చేశారు. స్వ‌యంగా దిల్ రాజునే ఈ మాట చెప్పాడంటే… ‘రౌడీ బాయ్స్‌’లో హాట్ హాట్ అంశాలెన్ని ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు. ట్రైల‌ర్‌లో ఓ లిప్ లాక్ సీన్ క‌నిపించింది. అది మ‌చ్చుక్కి మాత్ర‌మే అని… ఈ సినిమాలో బోల్డ్ సీన్లు, బీప్ డైలాగులు చాలా ఉన్నాయని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. అందుకే దిల్ రాజు ముందే ప్రిపేర్ చేసేస్తున్నాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close