అక్క‌డే.. ప‌వ‌న్ కి ఫ్లాట్ అయిపోయాడు

దిల్ రాజు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమాని అన్న సంగ‌తి `వ‌కీల్ సాబ్` రిలీజ్ రోజునే తేలిపోయింది. థియేట‌ర్లో సినిమా చూస్తూ… నిర్మాత అన్న సంగ‌తి మ‌ర్చిపోయి, పేప‌ర్ ముక్కలు విసిరి మ‌రీ త‌న అభిమానాన్ని చాటుకున్నాడు దిల్ రాజు. ప‌వ‌న్ తో సినిమా చేయ‌డం త‌న క‌ల‌. అది… `వ‌కీల్ సాబ్`తో తీరిపోయింది. అయితే.. ఇప్పుడు ప‌వ‌న్ తో మ‌రో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఇందుకు సంబంధించి ప‌వ‌న్ ద‌గ్గ‌ర నుంచి గ్రీన్ సిగ్న‌ల్ కూడా అందుకున్నాడు.

ప‌వ‌న్‌పై దిల్ రాజుకి ప్రేమ పెర‌గ‌డానికి, త‌న‌పై అభిమానం రెట్టింపు అవ్వ‌డానికి మ‌రో కార‌ణం కూడా ఉంది. `వ‌కీల్ సాబ్` సినిమా అంతా పూర్త‌య్యాక‌.. దిల్ రాజుని పిలిపించాడ‌ట ప‌వ‌న్‌. `సినిమా ఆడితే ఫ‌ర్వాలేదు.. ఆడ‌క‌పోతే… డ‌బ్బులు స‌ర్దుబాటు చేస్తా. కావాలంటే మీతో మ‌రో సినిమా చేస్తా` అని మాటిచ్చాడ‌ట‌. అదిగో… ఆ మాట‌కే దిల్ రాజు మ‌ళ్లీ ఫిదా అయిపోయాడు. ప్రీ రిలీజ్ రోజున‌.. వేదిక‌పై ప‌వ‌న్ గురించి మాట్లాడుతూ దిల్ రాజు భావోద్వేగానికి గురైన సంగ‌తి తెలిసిందే. దానికి కార‌ణం అదే. సినిమా హిట్ట‌య్యింది. క‌రోనా ప్ర‌భావంతో వ‌సూళ్లు త‌గ్గినా, నిర్మాత‌గా తాను, బ‌య్య‌ర్లూ సేఫ్‌. అందుకే.. ఇప్పుడు అర్జెంటుగా ప‌వ‌న్‌తో మరో సినిమా ఫిక్స్ చేసేశాడు. ఈమ‌ధ్య కాలంలో ప‌వ‌న్ కి భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చిన నిర్మాత దిల్ రాజునే. వ‌కీల్ సాబ్ కి రూ.50 కోట్ల‌కు పైగానే పారితోషికం ముట్ట‌జెప్పాడ‌ట‌. ఈసారి అది ఇంకాస్త పెరిగింద‌న్న‌ది ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గీతా’లో మరో సంతకం

'బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే...

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

పూరి గ‌ట్స్‌.. రెండ్రోజుల ముందే ప్రీమియ‌ర్‌

సినిమాకి టాక్ చాలా ముఖ్యం. పాజిటీవ్ టాక్ వ‌స్తే - క‌ల‌క్ష‌న్లు వ‌స్తాయి. ఏమాత్రం తేడా వ‌చ్చినా - ఫ‌ట్‌మ‌న‌డం ఖాయం. రిలీజ్ డే టాక్ అనేది వ‌సూళ్ల‌లో కీల‌క పాత్ర పోషిస్తుంటుంది....

HOT NEWS

[X] Close
[X] Close