కొత్త బంగారు లోకం..2

దిల్‌రాజు ఓ ద‌ర్శ‌కుడ్ని న‌మ్మాడంటే ఓ ప‌ట్టాన వ‌ద‌ల‌డు. ఫ్లాపులున్నా స‌రే – విడ‌వ‌డు. చాలామంది విష‌యంలో ఇదే రుజువైంది. ఇప్పుడు శ్రీ‌కాంత్ అడ్డాల అండ దండ కూడా ఆయ‌నే. కొత్త బంగారు లోకం, సీత‌మ్మ వాకిట్లో స‌రిమ‌ల్లె చెట్టు సినిమాలు రెండూ వీళ్ల కాంబోలోనే వ‌చ్చాయి. బ్ర‌హ్మోత్స‌వం అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డం, అంత‌కు ముందొచ్చిన ముకుంద కూడా ఏమాత్రం ర‌క్తి క‌ట్టించ‌క‌పోవ‌డంతో శ్రీ‌కాంత్ అడ్డాల వైపు చూడ్డానికి నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి దిల్‌రాజు ఆయ‌న‌కు ఆప‌న్న హ‌స్తం అందించారు. దిల్‌రాజు కాంపౌండ్ లో మూడో సినిమా చేయ‌డానికి శ్రీ‌కాంత్ అడ్డాల దాదాపుగా సిద్ధ‌మైపోయారు. ఇప్ప‌టికే క‌థ కూడా రెడీగా ఉంద‌ట‌. కొత్త బంగారు లోకం టైపులోనే యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీ తీయ‌డానికి శ్రీ‌కాంత్ రెడీగా ఉన్నాడ‌ని టాక్‌. దిల్‌రాజుకీ ఈ క‌థ న‌చ్చింద‌ట‌. అయితే కొత్త‌వాళ్ల‌తో వెళ్దామా? లేదంటే యంగ్ హీరోల్లో ఒక‌రిని ఎంచుకొందామా అనేది ఇంకా తేల్లేదు. కాక‌పోతు ఈ సినిమాతో హిట్టు కొట్ట‌డం శ్రీ‌కాంత్‌కి అత్య‌వ‌స‌రం. ఆ హిట్టు ఇచ్చే బాధ్య‌త దిల్‌రాజు తీసుకొన్నారిప్పుడు. మ‌రి ఈ హ్యాట్రిక్ కాంబోకి ముహూర్తం ఎప్పుడో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close