ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సతీమణి అనిత మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 47 సంవత్సరాలు. ఇటీవల దిల్‌రాజు తన కుమార్తె వివాహం వైభవంగా జరిపించారు. ఆ సమయంలోనే అనిత అనారోగ్యం పాలయ్యారని తెలుస్తోంది. ఆమధ్య దిల్‌రాజు – అనితల మ్యారేజ్ యానివర్సరీ కూడా ఘనంగా జరిగింది. మరి ఇంతలోనే ఏమైందన్నది అర్థం కావడం లేదు. దిల్‌రాజు భార్యా వియోగం గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకొంటున్న టాలీవుడ్ ప్రముఖులు షాక్‌కి గురవుతున్నారు. దిల్‌రాజు తన సినిమాలకు అనితా ప్రజెంట్స్ అంటూ టైటిల్ కార్డులో భార్య పేరు వేసుకొనేవారు.