‘హిట్’ డైరెక్ట‌ర్‌తో.. దిల్ రాజు పాన్ ఇండియా మూవీ

హిట్ తో ఆక‌ట్టుకొన్నాడు శైలేష్ కొల‌ను. ఆ త‌ర‌వాత హిట్ 2 తీశాడు.. అదీ హిట్టే. అలా హిట్ టైటిల్ ఓ ఫ్రాంచైజీగా మారిపోయింది. ఇప్పుడు వెంక‌టేష్‌తో సైంధ‌వ్ తీస్తున్నాడు. ఈ డిసెంబ‌రులో విడుద‌ల అవుతోంది. ఆ త‌ర‌వాత‌.. నాని హీరోగా హిట్ 3 ప‌ట్టాలెక్కుతుంది. ఈలోగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి శైలేష్ సంత‌కాలు చేశాడు. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌. ఇది కూడా హిట్ లానే ఓ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌. క‌థ సిద్ధ‌మైంది. ఓ బాలీవుడ్ హీరోకి ఈ క‌థ వినిపించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు దిల్ రాజు. అది కుద‌ర‌ని ప‌క్షంలో.. తెలుగు హీరోతోనే పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమా బ‌డ్జెట్ దాదాపుగా రూ.150 కోట్ల‌ని టాక్‌. శైలేంద్ర ఆ స్థాయిలో సినిమాని మోయ‌గ‌ల‌డా? లేదా? అనేది క్వ‌శ్చ‌న్ మార్క్‌. సైంధ‌వ్ భారీ బ‌డ్జెట్ సినిమానే. కాక‌పోతే వంద‌, రూ.150 కోట్ల స్థాయి కాదు. ఆ సినిమాని శైలేష్ ఎలా హ్యాండిల్ చేస్తాడ‌న్న‌దానిపై పాన్ ఇండియా సినిమా ఎప్పుడ‌న్న‌ది డిసైడ్ అవుతుంది. దిల్ రాజు ఈ మ‌ధ్య రిస్కీ నిర్ణ‌యాలు ఎక్కువే తీసుకొంటున్నాడు. సైంధ‌వ్ రిజ‌ల్ట్ ఎలా ఉన్నా.. శైలేష్ సినిమాని ప‌ట్టాలెక్కించాల్సిందే అనుకొంటున్నార్ట‌. కాక‌పోతే సైంధ‌వ్ హిట్ అయితే.. కావ‌ల్సిన హీరో దొరుకుతాడు. లేదంటే దొరికిన హీరోతో ఎడ్జ‌స్ట్ అయిపోవాలంతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ మెన్షన్ !

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రిమాండ్ కు తరలించారని.. రిమాండ్ ను కొట్టి వేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం ధర్మాసనం ముందు...

ప్ర‌వీణ్ స‌త్తారు… మిష‌న్ త‌షాఫి!

చంద‌మామ క‌థ‌లు, గ‌రుడ‌వేగ చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన ఘోస్ట్, గాండీవ‌ధారి అర్జున నిరాశ ప‌రిచాయి. ఇప్పుడు ఆయ‌న‌.. ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. అదే.. మిష‌న్ త‌షాఫీ....

ఈవారం బాక్సాఫీస్‌: ముక్కోణ‌పు పోటీ

గ‌త‌వారం బాక్సాఫీసు కొత్త సినిమాల్లేక వెల‌వెల‌పోయింది. `స‌ప్త సాగ‌రాలు దాటి` అనే ఓ డబ్బింగ్ సినిమా వ‌చ్చింది కానీ, ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఈసారి... ఏకంగా మూడు క్రేజీ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి....

ఎల్బీనగర్ కోసమే చంద్రబాబుకు మధుయాష్కీ మద్దతు !

తెలంగాణ సీనియర్ నేత, రాహుల్ కు సన్నిహితుడిగా పేరున్న మధుయాష్కీ ఎల్బీనగర్‌లో పోటీ చేయాలనుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీగా మాత్రమే పోటీ చేసిన మధుయాష్కీ ఈ సారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు.కానీ నిజామాబాద్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close