హ‌రీష్‌శంక‌ర్‌కు ఛాన్స్ లేన‌ట్టేనా…!

ఇండ‌స్ట్రీలో ఒక ప్రాజెక్ట్‌ను సెట్ చేయాలంటే ఎన్నో స‌మీక‌ర‌ణాల్ని, మ‌రెన్నో లెక్క‌ల్ని ప‌రిగ‌ణ‌లోని తీసుకోవాల్సిఉంటుంది. ఇక సెట్స్‌మీద‌కే త‌రువాయి అనుకున్న సినిమాలెన్నోగుమ్మ‌డికాయ కొట్ట‌క‌ముందే ప్యాక‌ప్ అయిన సంద‌ర్భాలున్నాయి. మ‌రికొన్ని సినిమాలు రేపోమాపో ప్ర‌క‌ట‌న అంటూనే సుదీర్ఘ‌కాలం డోలాయ‌మానంలో ఉంటాయి. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు హ‌రీష్‌శంక‌ర్ అదే ప‌రిస్థితిని ఫేస్ చేస్తున్నాడు. దాగుడుమూత‌లు పేరుతో హ‌రీష్‌శంక‌ర్ ఓ మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను రాసుకున్నాడు. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ఈ సినిమాకు ప్లాన్ చేశాడు. ఈ క‌థ‌ను శ‌ర్వానంద్‌, నాని, సాయిధ‌ర‌మ్‌తేజ్ వంటి యంగ్‌హీరోల‌కు వినిపించాడ‌ని తెలిసింది. అయితే ఎవ‌రూ ఈ స‌బ్జెక్ట్ మీద అంత‌గా ఆస‌క్తిని చూపించ‌లేద‌ని చెబుతారు. దాంతో చేసేదేమిలేక దాగుడుమూత‌లు క‌థ‌ని ఓ ప‌క్క‌న దాచేశాడు హ‌రీష్‌శంక‌ర్‌. ప్ర‌స్తుతం దిల్‌రాజ్ సంస్థ‌లోనే త‌మిళ చిత్రం జిగ‌ర్తాండ రీమేక్‌కు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాడు.

కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సిద్దార్థ్‌, ల‌క్ష్మీమీన‌న్‌, బాబీ సింహా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం త‌మిళంలో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఓ రౌడీషీట‌ర్ వ్య‌క్తిత్వాన్ని మార్చే ఒక సినిమా ద‌ర్శ‌కుడి క‌థ ఇది. ఇప్పుడు ఈ క‌థ‌కు తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్పులు చేస్తున్నాడు హ‌రీష్‌శంక‌ర్‌. ఇందులో వరుణ్ తేజ్ న‌టిస్తార‌ని స‌మాచారం. ఈ క‌థ న‌చ్చ‌డంతో దిల్‌రాజు ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేసుకొని రావాల్సిందిగా హ‌రీష్‌శంక‌ర్‌కు సూచించాడు. ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన బాబీసింహా పాత్ర క‌థ‌లో చాలా కీల‌కంగా ఉంటుంది. దాంతో ఆ క్యారెక్ట‌ర్‌ను మ‌రింత పాలిష్‌డ్‌గా తీర్చిదిద్దాల‌ని హ‌రీష్‌శంక‌ర్‌కు సల‌హా ఇచ్చాడ‌ట దిల్‌రాజు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం….హ‌రీష్‌శంక‌ర్ త‌యారు చేసుకున్న స్క్రిప్ట్ ప‌ట్ల దిల్‌రాజు అంత సంతృప్తిగా లేడ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఈ స్క్రిప్ట్ కు సంబంధించి చాలా వెర్ష‌న్స్ సిద్ధం చేశాడ‌ట హ‌రీష్‌శంక‌ర్‌. అయితే అందులో ఏదీ దిల్‌రాజుకు క‌న్విన్సింగ్‌గా అనిపించ‌లేద‌ని చెబుతున్నారు. దీంతో జిగ‌ర్తాండ రీమేక్ ప‌ట్టాలెక్కుతుందా? ఈ ప్రాజెక్ట్ నుంచి హ‌రీష్‌శంక‌ర్‌ను త‌ప్పించి మ‌రొక ద‌ర్శ‌కుడిని ఎంచుకుంటారా? లేదా దిల్‌రాజు మ‌రికొంత కాలం వేచిచూసే ధోర‌ణిలో ఉన్నారా? అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.