ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్ రెడీ.. ఇక గండమే !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణమం చోటు చేసుకుంది. ముఖ్యమైన నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్‌గా మారారు. అయిరే.. హైదరాబాద్ కు చెందిన రామచంద్ర పిళ్లైనే అప్రూవర్‌గా మారుతారని అనుకున్నారు. కానీ సీబీఐ అనూహ్యంగా దినేష్ అరోరాను అప్రూవర్‌గా మారినట్లుగా ప్రకటించింది. ఆయనను సాక్షిగా పరిగణించాలని కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో అరెస్ట్ చేసిన ముగ్గురిలో దినేష్ అరోరా ఒకరు. మరో నిందితుడు సమీర్ మహేంద్రు.. అరోరా నిర్వహిస్తున్న రాధా ఇండస్ట్రీస్ బ్యాంక్ ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. దినేష్ అరోరా, ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా సహా నిందితులందరిపై ఐపీసీ సెక్షన్ 120 బి, 477 ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు.

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో 2021, 2022లో రూపొందించిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. గతేడాది నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఈ విధానంలో భాగంగా నగరాన్ని 32 జోన్‌లుగా విభజించి 849 షాపులకు సంబంధించి ప్రైవేట్ బిడ్డర్లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. ఈ విధానాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యతిరేకిస్తూ ఎల్‌జీకి ఫిర్యాదు చేశాయి. దీనిపై విచారణ జరుపుతున్నారు.

ఈ లిక్కర్ స్కాంలో కింగ్ పిన్‌గా బీజేపీ నేతలు ఆరోపమలు చేస్తోంది.. కేసీఆర్ కుమార్తె కవితపైనే. కవిత పీఏగా ప్రచారంలో ఉన్న బోయినపల్లి అభిషేక్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయన చాలా పెద్ద వ్యక్తి అని.. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని చెప్పి.. ఆయనకు బెయిల్ రాకుండా సీబీఐ అడ్డుకుంది. ఇప్పుడు దినేష్ అరోరాను సాక్షిగా చేయడంతో.. తెలంగాణ రాజకీయాల్లోనూ కొత్త మలుపులు ఖాయంగా చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close