కల్యాణవైభోగమే సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకొంది నందిని రెడ్డి. ఈసినిమా మరీ అంత హిట్టు కాదు గానీ… నందినికి ఊరటనిచ్చింది. అయితే తదుపరి సినిమాని పట్టాలెక్కించడానికి మాత్రం కాస్త సమయం తీసుకొంది. మధ్యలో నితిన్ కోసం ట్రై చేసింది. కానీ… నితిన్ ఛాన్సు ఇవ్వలేదు.ఇప్పుడు నందినికి హీరో దొరికాడు. తనే… విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో అందరి కళ్లూ విజయ్‌పై పడ్డాయి. దర్శక నిర్మాతలు విజయ్ ముందు క్యూ కట్టారు. కానీ విజయ్ మాత్రం నందినిపై నమ్మకం ఉంచాడు. కల్యాణ వైభోగమే సినిమాలో కథానాయికగా నటించిన మాళవిక నాయర్ ఈ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. కల్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
లవ్, ఎమోషన్, ఫీల్ గుడ్ సీన్స్.. దాంతో పాటు మంచి మ్యూజిక్. ఇదే నందినిరెడ్డి బలం. అలా మొదలైంది, కల్యాణ వైభోగమేలో ఇవే కనిపించాయి. ఇప్పుడూ వాటినే నమ్ముకొందట. ఆల్రెడీ స్క్రిప్టు రెడీ అయిపోయింది. క్యాచీ టైటిల్ కోసం నందిని అన్వేషిస్తోంది. త్వరలోనే టైటిల్‌నీ ప్రకటించేస్తారు.