సమకాలిక ఇతివృత్తాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు క్రిష్. గౌతమి పుత్ర శాతకర్ణి తరవాత క్రిష్‌పై గౌరవం మరింత పెరిగింది. అగ్ర కథానాయకులు కూడా క్రిష్ కథ చెబితే వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న క్రిష్.. ఆ తరవాత తెలుగులో ఓ సినిమాని రూపొందించడానికి సన్నాహాలుచేస్తున్నారు. అందులో భాగంగా అహం బ్రహ్మస్మిః అనే సినిమాని ప్రకటించారు కూడా. ఇందులో కథానాయకుడిగా ఎవరు కనిపిస్తారు? అనే విషయం తెలియకపోయినా.. ప్రస్తుతం క్రిష్ దృష్టి పవన్ కల్యాణ్‌పై పడిందని తెలుస్తోంది. పవన్‌తో సినిమా చేయాలని క్రిష్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఓ కథ కూడా రెడీగా ఉంది. అయితే పవన్‌తో భేటీ అయ్యే ఛాన్సే రాలేదు. ఇప్పుడు మాత్రం ఆ అవకాశం వచ్చిందని తెలుస్తోంది. క్రిష్‌కి పవన్ అపాయింట్మెంట్ దొరికిందని.. త్వరలోనే పవన్‌కి ఓ కథ వినిపించడానికి సమాయాత్తం అవుతున్నాడని తెలుస్తోంది. అయితే అది.. అహం బ్రహ్మస్మినా.. మరో కథా? అనేది తెలియాలి. ఏది ఏమయినా.. ఈసారి కమర్షియల్ సినిమానే తీయాలని ఫిక్సయ్యాడట. అయితే తనదైన భావోద్వేగాలు, సున్నితమైన అంశాలూ అందులో మేళవించాడని తెలుస్తోంది.