రామ్ పోతినేని ఒక అభిమాని పాత్రలో చేస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకుడు. ఈ చిత్రంలో ఉపేంద్ర ఆంద్రాకింగ్ పాత్రలో చేస్తున్నారు. టీజర్, ట్రైలర్, పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు బెంగళూరులో కన్నడ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో ఉపేంద్ర పాల్గొన్నారు.
ఇంతమంది స్టార్స్ వుండగా ఆంద్రకింగ్ పాత్రలో ఉపేంద్రనే ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నకు దర్శకుడు మహేశ్ సమాధనం ఇచ్చారు.” కన్నడ తెలుగు తమిళ్ మలయాళం ఇలా అన్ని పరిశ్రమల్లో అందరూ సొంతగా ఫీలయ్యే యూనిక్ స్టార్ ఉపేంద్ర గారు. అన్ని భాషలు వాళ్ళు ఆయన్ని తమ హీరో గానే చూస్తారు. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ పోషించడానికి, ఒకరకమైన ఫిలాసఫీ, అండర్ స్టాండింగ్ కావాలి. మిగతా స్టార్స్ ఇలాంటి క్యారెక్టర్ని చేస్తారని నేను అనుకోవడం లేదు’ అని చెప్పుకొచ్చారు.
‘ఈ సినిమాని కథ, స్క్రీన్ ప్లే కోసం కాదు కేవలం సినిమా అభిమానుల కోసం చేశాను. సినిమా చూసిన తర్వాత సినిమాకి ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమాలో వున్న ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో రామ్ నటన అసాధారణంగా ఉంది. సినిమా చూస్తున్నపుడు రామ్ ఎనర్జీ కట్టిపడేసింది’ అని చెప్పుకొచ్చారు ఉపేంద్ర.

