చిరు సినిమా… గుట్టు విప్పిన మారుతి

చిన్న,చిన్న సినిమాల‌తోనే పెద్ద ద‌ర్శ‌కుడు అయిపోయాడు మారుతి. త‌న ఖాతాలో భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు, ప్ర‌తిరోజూ పండ‌గే లాంటి పెద్ద హిట్లు ఉన్నా- ఇప్ప‌టి వ‌ర‌కూ అగ్ర హీరోల‌తో సినిమాలు చేయ‌లేదు. ఇప్పుడు ఏకంగా.. చిరంజీవితోనే సినిమా ఓకే చేయించుకున్నాడు. మారుతి – చిరంజీవి కాంబోలో ఓసినిమా రాబోతోంద‌ని ఆమ‌ధ్య ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్పుడు దీనిపై మారుతి కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ”చిరంజీవిగారిని ఇటీవ‌ల క‌లిసి ఓ లైన్ వినిపించా. ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. ఇప్పుడు దాన్ని డ‌వ‌లెప్ చేయాలి. నా మార్క్ కామెడీతో పాటుగా, చిరు అభిమానులు ఆశించే అన్ని అంశాలూ ఆ సినిమాలో ఉంటాయి” అని హింట్ ఇచ్చేశాడు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మంచి రోజులొచ్చాయి` గురువారం విడుద‌ల కానుంది. ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ దాదాపు పూర్త‌యిపోయింది. త్వ‌ర‌లోనే చిరంజీవి కోసం స్క్రిప్టు త‌యారు చేసే ప‌నుల్లో ప‌డిపోనున్నాడు మారుతి. అయితే.. చిరు డేట్లు ఇప్ప‌టిప్పుడు దొర‌క‌డం క‌ష్టం. ఆయ‌న బిజీగా ఉన్నారు. కాబ‌ట్టి ఈలోగా మారుతి మ‌రో మీడియం సైజు సినిమా చేయాల్సివుంటుంది. మారుతి ద‌గ్గ‌ర అందుకు త‌గిన క‌థ‌లు కూడా రెడీగా ఉన్నాయ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

మ‌హేష్ కోసం రూటు మారుస్తున్న త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుంది? కుటుంబం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు, సెంటిమెంట్.. వీటి మధ్య‌లో హీరోయిజం, పంచ్‌లూ.. ఇవ‌న్నీ ఉంటాయి. త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్లు అత్తారింటికి దారేది నుంచి... అలా...

‘ప్రాజెక్ట్ కె’… రెండు భాగాలా?

ఈమ‌ధ్య పార్ట్ 2 సంస్క్రృతి బాగా ఎక్కువైంది. బాహుబ‌లి నుంచీ ఈ సంప్ర‌దాయం కొన‌సాగుతోంది. ప్ర‌భాస్ స‌లార్ రెండు భాగాలే. పుష్ప‌, కేజీఎఫ్‌లూ బాహుబ‌లిని అనుస‌రించాయి. ఇప్పుడు కార్తికేయ రెండో భాగం రాబోతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close