సుకుమార్ శిష్యుడి బాలీవుడ్ సినిమా

కుమారి 21 ఎఫ్‌తో ఆక‌ట్టుకొన్న ద‌ర్శ‌కుడు సూర్య ప్ర‌తాప్‌. ఈ సుకుమార్ శిష్యుడికి గురువు అండ‌దండ‌లు గ‌ట్టిగా ఉన్నాయి. ఆ ప్రోత్సాహంతోనే `18 పేజీస్‌` సినిమా తీశాడు. అది కూడా బాగానే ఆడింది. అయితే ఆ త‌ర‌వాత సూర్య కుమార్ నుంచి సినిమా ఏదీ రాలేదు. ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సినిమా చేయ‌డానికి స‌మాయాత్తం అవుతున్నాడ‌ని తెలుస్తోంది.

క‌నెక్ట్ మీడియా సంస్థ సూర్య ప్ర‌తాప్ తో ఓ సినిమా చేయ‌బోతోంద‌ని టాక్. అందుకోసం ఓ బాలీవుడ్ హీరోని వెదికే ప‌నిలో ఉన్నాడు సూర్య ప్ర‌తాప్‌. ప్ర‌స్తుతం ఆయ‌న ముంబైలోనే ఉన్నారు. టైగ‌ర్ ష్రాఫ్‌తో ఆయ‌న సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు టాక్‌. అంతా ఓకే అయితే… టైగర్‌తోనే సూర్య ప్ర‌తాప్ సినిమా ఉండొచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక గురువు సుకుమార్ హ‌స్తం ఉందో లేదో తెలియాల్సివుంది. కుమారి 21, 18 పేజీస్ చిత్రాలు సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లో నిర్మించారు. ఆ క‌థ‌లో, స్క్రీన్ ప్లేలో సుకుమార్ స‌ల‌హాలూ, సూచ‌న‌లు బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. మ‌రి ఆయ‌న ఈ ప్రాజెక్ట్ లోనూ ఉంటారా, లేదా? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఎక్కడ ?

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వాయిస్ లేకుండా చేసింది. ఉద్యోగ సంఘం నేతల్ని ఉద్యోగుల వాయిస్ కాకుండా తమ వాయిస్ వినిపించేలా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారికి నోరు పెగలడం...

తననూ లెక్కేసుకోవాలంటున్న రమణదీక్షితులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ...

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close