ఒకే అమ్మాయికి మనసిచ్చిన ఇద్దరు వెటరన్ దర్శకులు

దర్శకుడు పెద్ద వంశీ కథల్లో కొసమెరపులు భలే గమ్మత్తుగా వుంటాయి. చివర్లో ఆయన ఇచ్చే ట్విస్ట్ కొన్నిసార్లు కన్నీళ్లు తెప్పిస్తుంది, ఇంకొన్ని సార్లు హాయిగా నవ్వించేసి మనసుని తేలిక చేసేస్తుంది. తాజాగా ఆయన చెప్పిన ఓ ప్రేమకథ భలే ముచ్చటగా వుంది. ‘శంకరాభరణం’ షూటింగ్ జరుగుతున్న రోజులవి. ఆ సినిమాకి వంశీ సహాయ దర్శకుడు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అప్పటికి స్టిల్ కెమెరామెన్. ఇద్దరూ మంచి స్నేహితులు. మద్రాస్ లో పక్కపక్క పోర్షన్స్ లో వుండేవారు.

రాజమండ్రి రఘుదేవపురంలో శంకరాభరణం షూటింగ్ జరుగుతోంది. వంశీ, ఈవీవీ ఇద్దరూ ఆ షెడ్యుల్ లో పని చేసేవారు. ఆక్కడ షూటింగ్ జరుగుతునన్ని రోజులు లొకేషన్ కి ఓ అమ్మాయి వచ్చేదట. ఆ అమ్మాయిని చూసిన వంశీకి మనసులో ఎదో రకంగా అయిపోయేదట. ప్రతి రోజు ఆ అమ్మాయి కోసం ఎదురుచూడటం ఒక దినచర్యగా మారిందట. ఒకసారి ఆ అమ్మాయి వంశీని చూసి నవ్విందట. ఇంక ఆయన థ్రిల్ కి హద్దు లేదు.

ఒకరోజు లంచ్ చేస్తున్నపుడు ఆ అమ్మాయి పేరు ‘వీరలక్ష్మీ’ అని తెలుసుకున్నారట వంశీ. అన్నీ విషయాలు ఈవీవీ తో పంచుకునే వంశీ ఈ విషయాన్ని మాత్రం చెప్పలేదట. ఆవేళ ఆ వూర్లో షూటింగ్ ఆఖరి రోజు. మొదటిసారిగా వీరలక్ష్మీ, వంశీ దగ్గరికి వచ్చి ‘రేపటి నుంచి షూటింగ్ వుండదట. మీరెవరూ ఇంక రారట’ అని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో వంశీ గుండె పగిలినంత పనైపోయింది. వ్యాన్ ఎక్కి రాజమండ్రి వెళ్ళిపోతున్న వంశీని చూసి మేడెక్కి ఏడుస్తూ చేయి ఊపిందట వీరలక్ష్మీ. దీంతో వంశీ పని అదోరకంగా అయిపోయిందట.

కొసమెరపు: ఆ రోజు రాత్రి మందు తెచ్చుకొని తాగుతున్నారు ఈవీవీ. తనకూ పెగ్గు పోయామని అడిగారు వంశీ. కాస్త పెద్ద పెగ్గే పోశారు ఈవీవీ. అంతకుముందు అలవాటు లేని వంశీ గబగబా తాగేశారు. సైలెంట్ గా వంశీ వంక చూసిన ఈవీవీ ‘’ ఈవేళ నా మనసేం బాలేదు వంశీ’ అన్నారు.
‘ఎందుకని’ అడిగారు వంశీ.
‘’రఘుదేవపురంలో ఒక అమ్మాయిని ప్రేమించానయ్యా. నా కంటే ఎక్కువగా ప్రేమించింది తను’ అన్నారు ఈవీవీ
‘అవునా.. ఎవరామ్మాయి? అడిగారు వంశీ
‘ఎవరో తెలియదు కానీ… పేరు.. వీరలక్ష్మీ’ ఇది ఈవీవీ అన్సర్.
ఈ సమాధానం విన్న వంశీ… అదోలా ఉండిపోయి… ఇంకో పెగ్గు లేపేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

ఆ ఇద్దరు మంత్రులతో రేవంత్ కు గ్యాప్ పెరుగుతుందా..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సంబంధిత మంత్రులు లేకుండా రేవంత్ సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. బుధవారం సచివాలయంలో వ్యవసాయ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close