నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. దీంతో పాటుగా మరో సినిమా కూడా మొదలెట్టాలని బాలకృష్ణ భావిస్తున్నారు. అందుకే ఈమధ్య వరుసగా కథలు వింటున్నారు. పలువురు దర్శకులు బాలయ్యని కలిసి కథలు చెబుతున్నారు. ఈ లిస్టు రోజు రోజుకీ పెరుగుతోంది. క్రిష్ తో ‘ఆదిత్య 999’ చేద్దామనుకొన్నారు బాలయ్య. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. ఆ తరవాత కొంతమంది దర్శకులు కథలు వినిపించారు. వాళ్లలో కొరటాల శివ, హరీష్ శంకర్, వివేక్ ఆత్రేయ, దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాస రాజు ఉన్నారు. ఇప్పుడు వశిష్ట కూడా చేరారు. ఇటీవల వశిష్ట బాలయ్యని కలిసి కథ వినిపించారు. అది బాలయ్యకు కూడా నచ్చింది. ప్రస్తుతం ఈ కథపై వశిష్ట కసరత్తు చేస్తున్నారు. వశిష్ట ఇది వరకు రవితేజకు సైతం ఓ కథ వినిపించారు. అన్నీ కుదిరితే.. బాలయ్య ప్రాజెక్టు ముందుకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గోపీచంద్ మలినేని సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. మరో సినిమా ఏమిటి? ఎవరితో అనే విషయంలో ఉగాది తరవాత బాలయ్య నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా బాలయ్య ఇంకొన్ని కథలు వింటారని టాక్. అవన్నీ విన్న తరవాత.. ఏ కథ బెస్ట్ అనిపిస్తే, ఆ కథతో ట్రావెల్ అవుతారు. అయితే బాలయ్యకు కథలు చెప్పిన దర్శకులు మాత్రం తమ తదుపరి సినిమా బాలయ్యతోనే అనే ఆశతో ఉన్నారు. నిర్ణయం ఇప్పుడు బాలయ్య చేతిలో ఉంది. జూన్ లో కొత్త సినిమా ప్రారంభం అవుతుంది. అప్పటి వరకూ ఈ దర్శకులకు వెయిటింగ్ తప్పదు.


