సోషల్ మీడియాకు స్వేచ్చ.. 66 ఏ కేసులన్నీ ఎత్తివేత..!

సెక్షన్‌ 66-ఏ ఐటీ చట్టం కింద పెట్టిన కేసులను ఎత్తివేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ చట్టాన్ని కొట్టి వేసినా ఇంకా.. ఆ సెక్షన్ కింద కేసులు పెడుతూండటంపై ఇటీవలే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. దీంతో కేంద్ర హోంశాఖ స్పందించింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టిన వారిని ఐటీ చట్టం 66 ఏ కింద అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని మరీ దుర్వినియోగం చేస్తున్నారు. ఈ చట్టాన్ని ఆరేళ్ల క్రితమే సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

అసలు చట్టమే లేకపోయినా కేసులు పెడుతున్న విషయాన్ని… పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వెయ్యికిపైగా కేసులు ఇలా పెట్టారని ఆధారాలు సమర్పించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆరేళ్ల క్రితమే తాము కొట్టేసిన ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏ కింద పోలీసులు ఇప్పటికీ కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. తాము స్పష్టంగా తీర్పుఇచ్చినా ఇప్పటికీ కేసులు పెట్టడం ఆశ్చర్యంగానూ, భయానకంగానూ, దిగ్ర్భాంతికరంగానూ ఉందని వ్యాఖ్యానించింది.

చట్టం రద్దయినా కేసులు పెడుతున్నారంటూ.. అనేక ఫిర్యాదులు రావడంతో సుప్రీంకోర్టు 2019లో పోలీసులను చైతన్య పరచాలని ప్రత్యేకంగా రాష్ట్రాలను ఆదేశించింది. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కేంద్రం… ఆ కేసులను ఎత్తివేయడమే పరిష్కారమని భావించినట్లుగా తెలుస్ోతంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలిచ్చారు. ఇప్పుడు ఈ కేసుల బారిన పడిన అనేక మందికి విముక్తి లభిస్తుంది. అయితే.. లేని చట్టంపై కేసులు పెట్టి వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఇక ముందు వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కత్తి మహేష్ టెంప్లేట్ వైకాపా వదలదా? కత్తి స్థానాన్ని పోసాని భర్తీ చేయగలరా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలి అన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్...

పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి "పవన్ నీకెంత...

ప్రజల వరద కష్టాల కన్నా మీడియాకు సినిమా గొడవలే మిన్న !

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన...

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

HOT NEWS

[X] Close
[X] Close