తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై అనర్హతా వేటు తప్పదా !?

గత వారం తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. అయితే ఇది రొటీన్ బదిలీ అని అనుకున్నారు.. కానీ చాలా పెద్ద కథ ఉందని మెల్లగా బయటకు వస్తోంది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతకం తిరగబడే వ్యవహారం ఉందని .. ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ నామినేషన్‌తో పాటు అఫిడవిట్ దాఖలు చేశారు. దాన్ని అధికారులు అంగీకరించారు. దాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

తొలి దశలోనే ఎన్నికలు జరగడంతో.. దాదాపుగా రెండు నెలల తర్వాత కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు వెబ్‌సైట్‌లో శ్రీనివాస్‌గౌడ్‌కు చెందిన కొత్త అఫిడవిట్ ప్రత్యక్ష మయింది. పాతది తొలగించారు. ఓ సారి నామినేషన్‌తో పాటు ఆమోదించిన అఫిడవిట్‌ను తొలగించడం అసాధ్యం. ఎన్నికల అధికారులు సహకరించడంతో అలా చేయగలిగారు. ఆ ఆఫిడవిట్‌తో తప్పులు తడకలు ఉండటంతో ఇలా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని గమించిన కొంత మంది ఈసీకి ఫిర్యాదు చేశారు. గత ఏడాదిలో చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపి వివరాలు పంపాలని శశాంక్ గోయల్‌కు కేంద్ర ఈసీ నుంచి సమాచారం వచ్చింది.

విచారణ జరిపిన గోయల్ అలా జరిగింది నిజమేనని తేల్చినట్లుగా తెలుస్తోంది. దీంతో అప్పటి ఎన్నికల అధికారిగా ఉన్న రజత్ కుమార్‌కు కూడా ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల ఫ్రాడ్‌లను చాలా సీరియస్‌గా పరిగణిస్తారు. దీంతో అటు శ్రీనివాస్ గౌడ్.. ఇటు రజత్ కుమార్ కూడా నిండా మునిగిపోయినట్లేనని భావిస్తున్నారు. రజత్ కమార్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆత్మకూరు బరిలో ఆనం కుమర్తె !

ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చిన సందర్భంలో ఆసక్తికరంగా పరిణామాలు మారుతున్నాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ కుమార్తె కైవల్యారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమె తన భర్తతో కలిసి లోకేష్‌తో...

ఎన్టీఆర్ జాతీయ అవార్డులెక్క‌డ‌?

ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లు మొద‌ల‌య్యాయి.యేడాది పొడ‌వునా.. ఎన్టీఆర్ ని స్మ‌రించుకుంటూనే ఉంటారు. ఈరోజు ఏ పత్రిక చూసినా, ఎన్టీఆర్ నామ స్మ‌ర‌ణే. నాయ‌కుంతా `జై ఎన్టీఆర్‌` అంటూ ఆయ‌న జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోతున్నారు....

చిరు – వెంకీ కుడుముల… ఉందా..? లేదా?

ఆచార్య త‌ర‌వాత చిరంజీవి లెక్క‌లు మారాయి. ఆయ‌న కాసేపు... ఆగి, ఆలోచించ‌డం మొద‌లెట్టారు. వ‌రుస‌గా కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డం వ‌ల్ల‌... త‌న కెరీర్‌కి ప్ల‌స్ అవుతుందా? లేదా? అనేది లోతుగా...

హిట్ ట్రాక్ కాపాడుకున్న అనిల్ రావిపూడి

టాలీవుడ్‌లో అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కులు ఇద్ద‌రే ఇద్ద‌రు. ఒక‌రు రాజ‌మౌళి. ఇంకొక‌రు... అనిల్ రావిపూడి. మొన్న‌టి వ‌ర‌కూ కొర‌టాల శివ కూడా ఇదే జాబితాలో ఉండేవారు. కానీ `ఆచార్య‌` ఆ ట్రాక్ రికార్డుని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close