చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు సినిమా నుంచి వచ్చిన మీసాల పిల్ల పాట సూపర్ హిట్ అయ్యింది. మ్యూజికల్ ప్రమోషన్స్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. భీమ్స్ చేసిన గోదారిగట్టు పాటతో పోలికలు వచ్చాయి కానీ ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత చిరంజీవి–నయనతార పెర్ఫార్మెన్స్, సిగ్నేచర్ స్టెప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా సెకండ్ సింగిల్ శశిరేఖని వదిలారు. ఈ పాటపై ఇంటర్నెట్లో డివైడ్ టాక్ నడుస్తోంది. చిరంజీవి ఇప్పటికీ యంగ్ లుక్‌లో అదరగొట్టారనే కొందరు ప్రశంసిస్తే… ట్యూన్ కంపోజిషన్‌పై కొన్ని ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఈ ట్యూన్‌ను లిటిల్ హార్ట్స్‌లోని ‘కాత్యాయని…’ సాంగ్‌తో పోలుస్తూ నెగిటివ్ మీమ్స్ కనిపిస్తున్నాయి.
ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతిదానికి ట్రోలింగ్ కామన్‌గా మారింది. ఆ ట్రోలింగ్‌ను పక్కన పెడితే, ఈ పాట వరకూ మ్యూజికల్‌గా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది. ఈ పాటకు అనిల్ రావిపూడి, మెగాస్టార్ క్లాసిక్ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సాంగ్ లాంటి విజువల్ ల్యాండింగ్ క్యాప్చర్ చేశారు. ఆ పాట కూడా ఒక బ్యూటిఫుల్ హమ్మింగ్తో మొదలవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా స్ట్రింగ్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. శశిరేఖ కంపోజిషన్‌ను కూడా ఇంత సింపుల్ గానే ఉంచారు.
కానీ ఇక్కడ వోకల్ గా ఒక తేడా కనిపించింది. భీమ్స్ వాయిస్‌లో ఉన్న డైనమిక్స్ మెగాస్టార్ గ్రేస్‌ను మ్యాచ్ చేసేలా అనిపించలేదు. చాలా మందికి ఈ సాంగ్‌లో ఏదో ‘మిస్’ అయిన ఫీలింగ్ కలిగింది. అది భీమ్స్ వోకల్స్, మెగా బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా కుదరకపోవడమే.
చిరంజీవి పాట అనగానే కొన్ని వాయిస్స్ ఆడియన్స్ మైండ్‌లో రిజిస్టర్ అయిపోయాయి. ఫస్ట్ సింగిల్ ట్యూన్ కాస్త రొటీన్‌గా ఉన్నప్పటికీ ఉదిత్ నారాయణ్ వాయిస్ ఆ పాటకు కావాల్సిన గ్రేస్ అద్దింది. కానీ శశిరేఖలో భీమ్స్ వాయిస్ మెగా డైనమిక్స్ ముందు తేలిపోయింది. పాటను ఎంజాయ్ చేస్తూ పెర్ఫార్మ్ చేయడం చిరంజీవికి అలవాటు. ఈ పాటలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ పుష్కలంగా కనిపించింది. కానీ భీమ్స్ వాయిస్ ఆయన ముఖ కవళికల్లో మిళితమవ్వలేదు. బహుశా భీమ్స్, చిరంజీవికి పాడిన తొలి పాట కావడంతో ఫస్ట్ టైం వినడానికి కాస్త కొత్తగా, వింతగా అనిపించడం సహజమే. అయితే అనగననగ రాగ మతిశయిల్లుచునుండు తరహాలో ఈ పాట కూడా వినగ వినగా అలవాటైపోవచ్చు.
