నా శ‌వంతో కూడా రాజ‌కీయాలు చేస్తారేమో?

బాపు బొమ్మ‌గా గుర్తింపు తెచ్చుకొన్న దివ్య‌వాణి.. కొంత‌కాలంగా రాజ‌కీయాల్లో ఉన్నారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ఆమె ఆ పార్టీకి అధికార ప్ర‌తినిధిగా కొన‌సాగుతున్నారు. అయితే ఇప్పుడు సొంత పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఆ పార్టీకి తాను నిస్వార్థంగా సేవ చేస్తున్నా, గుర్తించ‌డ‌మే లేద‌ని, తాను అధికారం లేని, అధికార ప్ర‌తినిధి అని, ఓ క‌ళాకారుడు పెట్టిన పార్టీలో, క‌ళాకారుల‌కు స్థానం లేక‌పోవ‌డం త‌న‌ని ఆవేద‌న‌కు గురి చేస్తోంద‌ని వ్యాఖ్యానించారు.

దివ్య‌వాణి కోపానికి ఓ కార‌ణం ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన `మ‌హానాడు`లో దివ్య‌వాణికి మైక్ ఇవ్వ‌లేదు. ఆమెకు మాట్లాడే అవ‌కాశం రాక‌పోవ‌డంతో దివ్య‌వాణి అలిగారు. అందుకే త‌న కోపాన్ని ఈ విధంగా బ‌హిర్గ‌తం చేశారు. “మ‌మానాడు కోసం అర్థ‌రాత్రి కారులో ఒంట‌రిగా ప్ర‌యాణం చేశాను. ఆ స‌మ‌యంలో నాకు ఆరోగ్యం కూడా స‌రిగాలేదు. అయినా స‌రే రిస్క్ చేశాను. దార్లో నాకేమైనా అయితే ఏమ‌య్యేదో? నా శ‌వాన్ని అడ్డం పెట్టుకుని.. ఓట్లు అడుతారేమో? అంత‌కు మించి ఏం చేయ‌లేరు. మ‌హానాడులో నాకు మాట్లాడే అవ‌కాశం ఎందుకు ఇవ్వ‌లేదో నాకు అర్థం కాలేదు. నాకు మాట్లాడ‌డం చేత‌కాదా? మాట‌లు రావా?“ అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. అవ‌కాశం వ‌స్తే వైకాపాలోకి వెళ్తానంటూ సంకేతాలు కూడా పంపారామె. “నేను దేవుడి బిడ్డ‌ని.. వైకాపాలో నాలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. అక్క‌డైనా నాకు ఆద‌ర‌ణ ద‌క్కుతుందేమో? `నీకు త‌ప్ప‌కుండా న్యాయం జ‌రుగుతుంది` అని కొంత‌మంది నాకు అభ‌య‌హ‌స్తం అందించారు. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో“ అన్నారు దివ్య‌వాణి. చూస్తుంటే ఆమె టీడీపీ నుంచి వైకాపాలోకి జంప్ అయ్యే ఛాన్సులే ఎక్కువ క‌నిపిస్తున్నాయి. వైకాపాలో ఫైర్ బ్రాండ్ల‌కు లోటు లేదు. అక్క‌డ ఆల్రెడీ రోజా ఉన్నారు. మ‌రి.. దివ్య‌వాణి అవ‌స‌రం వైకాపాకు ఉంటుందా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

HOT NEWS

css.php
[X] Close
[X] Close