టిల్లూ 2లో.. ఓ కీల‌క‌మైన మార్పు!

చిన్న సినిమాగా విడుద‌లై సూప‌ర్ హిట్ అయ్యింది.. డీజే టిట్లు. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌, త‌న బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ… ఇవే ఈ సినిమా స‌క్సెస్‌కి ప్ర‌ధాన కార‌ణాలు. ఈ క్యారెక్ట‌ర్ మ‌రిన్ని అద్భుతాలు సృష్టిస్తుంద‌ని తెలుసుకొన్న ద‌ర్శ‌క నిర్మాత‌లు డీజే 2 కి ప్లాన్ చేశారు. మొన్నే ఈ సినిమాకి క్లాప్ కొట్టారు. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

డీజే టిల్లులో టిల్లుతో పాటు.. రాధిక క్యారెక్ట‌ర్ కూడా చాలా కీల‌కం. ఈ పాత్ర‌లో నేహా శెట్టి క‌నిపించింది. అయితే డీజే టిల్లు 2లో నేహా హీరోయిన్ కాదు. ఆమె స్థానంలో మ‌రో హీరోయిన్ ని ఎంచుకుంటారు. అయితే నేహా మాత్రం… అతిథి పాత్ర‌లో అలా మెరిసి, ఇలా మాయ‌మైపోతుంద‌ట‌. డీజే టిల్లు 2లో జ‌రిగిన ప్ర‌ధాన మైన మార్పు ఇది. పార్ట్ 1లో వ‌చ్చిన‌… పాత్ర‌లు కొన్ని పార్ట్ 2లోనూ కొన‌సాగుతాయి. ఇంకొన్ని కొత్త పాత్ర‌లు వ‌చ్చి చేర‌తాయి. వాటిలో హీరోయిన్ పాత్ర ప్ర‌ధాన‌మైన‌ది. ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం ఓ గ్లామ‌రెస్ హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రి న‌రేష్‌.. మ‌ళ్లీనా..?

ఈవీవీ మంచి ద‌ర్శ‌కుడే కాదు. నిర్మాత కూడా. ఈవీవీ సినిమా ప‌తాకంపై ఆయ‌న కొన్ని మంచి చిత్రాల్ని అందించారు. ఫ్లాపుల్లో ప‌డి స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈవీవీకి... త‌న సొంత బ్యాన‌రే మ‌ళ్లీ నిల‌బెట్టింది. ఈవీవీ...

బీజేపీని టార్గెట్ చేసే స్టైల్ మార్చిన కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ఇష్టారీతిన విమర్శించడమే ఇప్పటి వరకూ బీజేపీపై చేస్తున్న యుద్దంగా భావించేవారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు స్టైల్ మార్చారు. వికారాబాద్‌లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన ఆయన......

“ఆ ప్రశ్న” అడిగితే అసహనానికి గురవుతున్న జనసేన !

మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయనపై రకరకాల పద ప్రయోగాలు చేస్తూ మండి పడుతున్నారు. అంబటి రాంబాబును బపూన్‌ను చేస్తూ.. ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి మరీ...

లెక్కల్లేవ్ ..అయినా ఏపీని అలా వదిలేశారేంటి !?

ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన వారికి రాసిచ్చినట్లు కాదు. ఏదైనా రాజ్యాంగ పరంగా చేయాలి. ప్రజలు పన్నులు కట్టగా వచ్చే డబ్బును.. వారిని చూపించి చేసే అప్పును.. పద్దతిగా వాడాలి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close