తెలంగాణలో చార్జ్ తీసుకున్న డీకే శివకుమార్..‍‍‍‍‍! మరో బళ్లారి చేస్తారా..?

తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ.. విజయం ముందు బోర్లా పడకుండా ఉండటానికి పక్కా వ్యూహాకర్తల్ని తెలంగాణలోకి దింపారు. ప్రధానంగా ఆయన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ కు … తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. నాలుగు రోజులుగా డీకే శివకుమార్ హైదరాబాద్ మకాం వేసి.. ప్రజాకూటమి కోసం.. పక్కా స్కెచ్ లు వేస్తున్నారు. అనేక స్థానాల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు పుట్టి ముంచబోతున్నారనే రిపోర్టులు వచ్చాయి. కానీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి వారిని ఎలా బుజ్జగించాలో అర్థం కాలేదు. వెంటనే.. రాహుల్ సూచన మేరకు.. హైదరాబాద్ వచ్చిన శివకుమార్.. రెండు రోజుల్లో.. పరిస్థితి మార్చేశారు. ఒకటి, రెండు చోట్ల మినహా.. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తామన్న.. నాయని రాజేందర్ రెడ్డి లాంటి నేతల్ని కూడా దారికి తెచ్చుకున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా రెబెల్స్ సమస్య లేకుండా పోయింది.

ప్రస్తుత పరిస్థితి చూస్తే.. కూటమి కన్నా.. టీఆర్ఎస్ కే రెబల్స్ బెడద ఎక్కువ నియోజకవర్గాల్లో ఉంది. డీకే శివకుమార్ సేవల్ని… పోలింగ్ వరకూ ఉపయోగిచుకోవాలని… కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక బోర్డర్ లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపైనా ప్రత్యేకంగా కేర్ తీసుకంటున్నారు. కన్నడ ఎక్కువగా మాట్లాడే ప్రాంతాల్లో గెలుపును ఏకపక్షం చేసేందుకు ప్రణాళికలు రచించారు. తెలంగాణలో జరుగుతున్న హోరాహోరీ పోరులో.. తెర వెనుక వ్యూహాలే కీలకపాత్ర పోషించబోతున్నాయి. ఇలాంటి వాటిలో శివకుమార్ దిట్ట. కర్ణాటకలో ఆయన కాంగ్రెస్ పార్టీకి లైఫ్ ఇచ్చిన వ్యక్తిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ఒక్క కర్ణాటకలోనే కాదు.. దేశలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి అవసరం వచ్చినా ఉపయోగపడ్డారు. కొద్ది రోజుల కిందట.. గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ ను ఓడించడానికి .. బీజేపీ ఎమ్మెల్యేలను కోనుగోలు చేసే ప్రయత్నం చేసింది. అప్పుడు గుజరాత్ ఎమ్మెల్యేలందర్నీ బెంగళూరుకు తీసుకు వచ్చి రిసార్టులో ఉంచి.. అహ్మద్ పటేల్ గెలిచేలా చేయగలిగారు. 2002లో మహారాష్ట్రలోని విలాస్ రావ్ దేశ్ ముఖ్ సర్కారును కాపాడటంలోనూ.. ఎమ్మెల్యేల క్యాంప్ ఏర్పాటు చేయడంలోనూ… శివకుమార్ దే ప్రధాన పాత్ర. ఇటీవల బళ్లారిలో జరిగిన ఉపఎన్నిక బాధ్యతను కూడా శివకుమార్ తీసుకున్నారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. దాంతో ఆయన వ్యూహాలకు మరింత డిమాండ్ వచ్చి పడింది.

బీజేపీని శివకుమార్ తన వ్యూహాలతో విపరీతంగా చికాకు పెట్టారు. అమిత్ షా , మోడీ కూడా.. తట్టుకోలేకపోయారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నా.. పక్కా ప్లాన్ తో తిరగ్గొట్టింది.. ఆడియో టేపులతో దొరికిపోయేలా చేసి.. బీజేపీ పరువు పోగొట్టింది శివకుమారే. అందుకే… ఐటీ, ఈడీలను.. నెలకోసారి శివకుమార్ పైకి పంపుతూంటారు.. అమిత్ షా. ఆయన దగ్గర.. అవి దొరికాయి.. ఇవి దొరికాయి.. అని మీడియాలో ప్రచారం చేయిస్తారు కానీ.. ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోవాలని అనేక సార్లు శివకుమార్ సవాల్ చేశారు కానీ.. బీజేపీ నేతలు ఏమీ చేయలేకపోయారు. కనీసం ఆయనను కట్టడి చేయలేకపోయారు. ఇప్పుడు.. తెలంగాణలో బీజేపీకి ఆ పార్టీ.. అప్రకటిత మిత్రపక్షానికి గట్టి షాక్ ఇచ్చేందుకు తన బుర్రకు పదును పెడుతున్నారు. ఇదే టీఆర్ఎస్ ను ఆందోళనకు గురి చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close