దేశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటి డీఎల్ఎఫ్ లిమిటెడ్. 78 ఏళ్ల చరిత్రతో సుస్థిర వృద్ధి, ఇన్నోవేషన్లతో ముందుకు సాగుతోంది. రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ పార్కులు, హోటల్స్ వంటి విభాగాల్లో డీఎల్ఎఫ్ ల్యాండ్ మార్క్ లాంటి నిర్మాణాలను చేసింది. ఈ కంపెనీ, FY25లో రూ.17,000 కోట్ల విలువైన హౌసింగ్ ప్రాజెక్టులు లాంచ్ చేసింది. ముంబైలో రూ.900 కోట్ల లగ్జరీ ప్రాజెక్ట్ ‘వెస్ట్పార్క్’ ప్రారంభించింది.
1946లో ప్రారంభమైన డీఎల్ఎఫ్, భారతదేశంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, డెవలప్మెంట్, మేనేజ్మెంట్లో 78+ ఏళ్ల అనుభవం కలిగి ఉంది. ఇప్పటి వరకు 32.63 మిలియన్ చదరపు మీటర్ల ప్రాంతాన్ని డెలివర్ చేసింది. కస్టమర్-సెంట్రిక్ సర్వీస్‌లతో ప్రసిద్ధి చెందింది. రెసిడెన్షియల్ ప్లాటెడ్ కాలనీలు, గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టులు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఐటీ పార్కులు, హోటల్స్, హాస్పిటల్స్, ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణంలో అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది.
రియల్ ఎస్టేట్‌లో సాధారణంగా నమ్మకం నిలబెట్టుకోవడానికి కంపెనీలు చాలా కష్టాలు పడాలి. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనాలంటే.. చిన్న విషయం కాదు. ఇల్లు కొనేవారు ఎన్నో ఫిర్యాదులు చేస్తూంటారు. ఇలాంటి వాటి విషయంలో డీఎల్ఎఫ్ చాలా ఓపికగా వ్యవహరిస్తుంది. కస్టమర్లకు సంతృప్తి తమ విజయసూత్రంగా పెట్టుకున్నారు. దానితో పాటు మారుతున్న వినియోగదారులు, మార్కెట్ అభిరుచులకు అనుగుణంగా.. తమ పాలసీలు మార్చుకుని లగ్జరీ వైపు తమదైన ముద్ర వేశారు. దేశ రియల్ఎస్టేట్ రంగం గురించి చెప్పుకోవాలంటే.. డీఎల్ఎఫ్ గురించే ముందుగా చెప్పుకోవాలి.