అక్రమ కేసుల “సిట్” ఆఫీసులో పత్రాలకు నిప్పు !

సోషల్ మీడియా పోస్టుల దగ్గర్నుంచి చంద్రబాబు అక్రమ అరెస్టు వరకూ మొత్తం డీల్ చేసిన సీఐడీ, సిట్ ఆఫీసుల్లో పత్రాలన్నీ సర్దుకునే పనిలో అధికారులు ఉన్నట్లుగా కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా తప్పుడు కేసులు.. తప్పుడు వాంగ్మూలాలు, ట్యాపింగ్‌లు, అనధికార సమాచార సేకరణ .. ఇలా లెక్క లేనన్ని అక్రమాలను.. అధికారులు ేశారు. ఇప్పుడు టైం దగ్గర పడే సరికి అన్నింటినీ డిలీట్ చేయాలనుకుంటున్నారు.

టెక్నికల్ గా అయితే ఎవరికీ తెలియకుండా తెలంగాణలో ప్రణీత్ రావు చేసినట్లుగా మొత్తం డిలీట్ చేసి హార్డ్ డిస్కుల్ని నిలువుగా కోసేసి ఏదో ఓ నదిలో పడజేయవచ్చు. కానీ పత్రాలను మాత్రం తగులబెట్టాల్సిందే. అందుకే సిట్ ఆఫీసులో ఉన్న పత్రాలన్నింటినీ ముఖ్యంగా టీడీపీ నేతలపై ఉన్న కేసులకు సంబంధించి అక్రమంగా సంపాదించిన పత్రాలన్నింటికీ నిప్పు పెట్టేశారు.

సీఐడీ , సిట్ ఆఫీసులోని వ్యక్తులే ఈ విషయాన్ని గమనించి వీడియో తీసి మీడియాకు పంపారు. మీడియాలో ఈ అంశం సంచలనంగా మారింది. చిత్తు కాగితాల్ని తగలుబెట్టామని వారు కవర్ చేసుకోవచ్చు కానీ.. అవి హెరిటేజ్ కు సంబంధించిన పత్రాలని తగలబడకుండా దొరికిన కొన్ని అవశేషాల ద్వారా తేలింది. అయితే టీడీపీ నేతలు మాత్రం కాలిస్తే కనబడకుండా పోయే తప్పులు కాదని చేసింది.. అంతకు మించి చేశారని.. అంటున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత తప్పక అనుభవించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గురి తప్పిన ట్వీట్… వైసీపీ ప్లాన్ బూమరాంగ్!

ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసుకున్న వైసీపీ... సోషల్ మీడియా పుణ్యమా అని తన గోతిని తనే తవ్వి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. కూటమి సర్కార్ ను టార్గెట్ చేయబోయి తన...

టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీ‌నివాస్

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను నియమించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతోన్న అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో పల్లాకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు...

ప‌వ‌న్ ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?

డిప్యూటీ సీఎం... గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, గ్రామీణ తాగునీటితో పాటు అడ‌వులు లాంటి కీల‌క శాఖ‌లు. అంటే ప్ర‌తిరోజు జ‌నంతో మ‌మేకం అయ్యే శాఖ‌లే. ప్ర‌తి రోజు అలుపెర‌గ‌కుండా ప‌ర్య‌టిస్తూ, రివ్యూలు చేస్తూ, నిర్ణ‌యాలు...

శాఖ‌ల కేటాయింపు… పొత్తుల్లో మోడీనే ఫాలో అయిన చంద్ర‌బాబు

రెండ్రోజులుగా ఎదురుచూస్తున్న మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు ఏపీలోనూ పూర్త‌యింది. గ‌తానికి భిన్నంగా ఈసారి శాఖ‌ల కేటాయింపు కాస్య ఆల‌స్య‌మైనా...స‌మ‌తుల్యంగా కేటాయించిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. అయితే, ఈ శాఖ‌ల కేటాయింపులో చంద్ర‌బాబు -మోడీ ఒకేవిధంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close