“హైకోర్టు”పై అసెంబ్లీ చట్టం చెల్లుతుందా..!?

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల్ని నిర్ణయిస్తూ… ఏపీ సర్కార్ చట్టం చేసేసింది. గవర్నర్ ఆమోదించారు. గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. అయితే.. ఇక అంతా అయిపోయినట్లేనా. కానే కాదని న్యాయనిపుణులు అంటున్నారు. అనేక న్యాయసంబంధమైన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయని.. న్యాయ సమీక్ష నుంచి తప్పించుకుని బయటకు రావడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎనిమిది అంశాలను ప్రస్తావిస్తున్నారు.

న్యాయరాజధానిని ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తుంది..?

ప్రభుత్వం నిర్ణయించిన బిల్లులో న్యాయరాజధాని ప్రస్తావన ఉంది. కర్నూలును న్యాయ రాజధాని చేస్తామని ప్రతిపాదించారు. రాజధానిలోని కార్యాలయాల తరలింపుపై ఇప్పటికై హైకోర్టు స్టే ఇచ్చింది. కర్నూలుకు తరలించాలన్న రెండు న్యాయ విభాగ సంబంధిత ఆఫీసుల తరలింపును కూడా నిలిపివేసింది. అదే సమయంలో.. మూడు రాజధానులకు సంబంధించి కమిటీలు ఇచ్చిన నివేదికల్ని సమర్పించాలని కూడా ఆదేశించింది. అమరావతిలో పెద్దగా స్థలం లేదని… కర్నూలుకు తరలిస్తున్నామని అప్పట్లో ప్రభుత్వం వాదన వినిపించింది. ఇలా చాలా అసహజమైన వాదనగా తేలింది. ఎలా చూసినా.. హైకోర్టుతో సంబంధం ఉన్న న్యాయరాజధాని విషయంలో ప్రధానంగా న్యాయస్థానంలో అనేక ప్రశ్నలను ప్రభుత్వం ఎదుర్కొనే అవకాశం ఉంది. చట్టబద్దంగా లేకపోతే… హైకోర్టు నిర్ణయాన్ని కొట్టివేయడానికి అవకాశాలెక్కువ.

శాసన వ్యవస్థనూ ఆ బిల్లులు ధిక్కరించాయి..!

గవర్నర్ సంతకం పెట్టిన బిల్లులు నేరుగా.. శానస వ్యవస్థనూ ధిక్కరించాయి. ఎందుకంటే.. ఆ బిల్లులు ఇప్పటికీ శాసనమండలిలో ఉన్నాయి. ఓ సారి బిల్లులు మండలిలో ఉంటే..మరోసారి పెట్టడం సాధ్యం కాదు. ఆ బిల్లులు ఆమోదించినా.. వెనక్కి వచ్చినా మళ్లీ పెట్టవచ్చు. కానీ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు మాత్రం మరోసారి పెట్టకూడదు. ఆ బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాయని ప్రభుత్వం స్వయంగా .. అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇక్కడే.. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందా లేదా అనేది హైకోర్టు పరిశీలన జరిపే అవకాశం ఉంది.

గవర్నర్ ఇతర రాజ్యాంగ అవకాశాలను పరిశీలించారా..?

బిల్లులపై వివాదాలున్నప్పుడు.. .న్యాయ, రాజ్యాంగ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పుడు…గవర్నర్ ఖచ్చితంగా… తనకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సి ఉంటుంది. వాస్తవానికి గవర్నర్‌కు పరిమిత అధికారాలే ఉంటాయి. వాటిని సమర్థంగా వాడుకోవచ్చు. తన దృష్టికి వచ్చిన రాజ్యాంగ ఉల్లంఘనల గురించి చెబుతూ.. ఆయన ప్రభుత్వానికి బిల్లులను తిప్పి పంపవచ్చు. రెండో సారి ఆ బిల్లును ప్రభుత్వం పంపితే.. ఆమోదించడం తప్ప గవర్నర్‌కు మరో మార్గం లేదు. అయితే ఇక్కడ అలా జరగలేదు. అదే కాకుండా.. కేంద్ర చట్టాన్ని బ్రీచ్ చేసేలా.. మూడు రాజధానుల బిల్లులో అంశాలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపాల్సి ఉంటుంది. గవర్నర్ అలా కూడా చేయలేదు.

రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా మూడు రాజధానుల బిల్లు..!

దేశంలో అత్యున్నతమైనవి రాష్ట్రపతి ఉత్తర్వులు. ఆ ఉత్తర్వులను కూడా మూడు రాజధానుల బిల్లు ఉల్లంఘించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కడుతున్న జస్టిస్ సిటీలో హైకోర్టును ఏర్పాటు చేస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. దానికి వ్యతిరేకంగా.. తక్షణం… జ్యూడిషియల్ క్యాపిటల్‌గా కర్నూలును నిర్ణయిస్తూ.. బిల్లులో పొందు పరిచారు. అదే సమయంలో… హైకోర్టు అధికారాలను కూడా.. ఈ బిల్లు పరిగణనలోకి తీసుకోలేదు. లెక్క చేయలేదు. ఈ విషయంలో గవర్నర్ విభజన చట్టాన్ని పరిశీలించాల్సి ఉంది. కానీ చేయలేదు.

హైకోర్టు ఎక్కడ ఉండాలో అసెంబ్లీ నిర్ణయించగలదా..?

హైకోర్టు ఎక్కడ ఉండాలనేది.. నిర్ణయించే అధికారం.. అసెంబ్లీకి లేదనేది న్యాయనిపుణుల వాదన. అది పూర్తిగా వేరే సబ్జెక్ట్. ఇప్పటి వరకూ హైకోర్టులు ఏర్పాటైన విధానం చూస్తే.. స్పష్టత వస్తుంది. హైకోర్టును కర్నూలులో పెట్టాలనుకున్నప్పుడు.. ముందుగా ప్రతిపాదనను… సుప్రీంకోర్టుకు.. ఏపీ ప్రభుత్వం పంపారు. హైకోర్టు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయంలో న్యాయవ్యవస్థ ప్రధాన స్టేక్ హోల్డర్ అయినప్పుడు వారికి సంబంధం లేకుండా తరలింపు అనేది సాధ్యం కాదు. అలాంటప్పుడు.. ఎలా అసెంబ్లీలో చట్టం చేస్తారు..? గవర్నర్ సంతకం పెడతారు..?

మరెన్నో న్యాయసవాళ్లు..!

ఇతర అంశాల కన్నా.. న్యాయరాజధాని అంశంలోనే.. ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగాఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. న్యాయ వ్యవస్థ అధికారాల్లో చొరబడటం… రాష్ట్రపతి ఉత్తర్వులు… పార్లమెంట్ అధికారాలను సైతం ఉపయోగించుకుని ఈ బిల్లు చేసినట్లుగా స్పష్టంగా ఉందన్న అభిప్రాయం చెబుతున్నారు. రాజ్యాంగ ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే… ఈ బిల్లులు న్యాయసమీక్షలో నిలబడటం అంత తేలిక కాదనే అభిప్రాయంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాలు ఆరోగ్యం అత్యంత విష‌మం

అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్యం.. ఈరోజు మ‌రింత క్షీణించింది. ఆయ‌న ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని స‌మాచారం. కాసేప‌ట్లో వైద్యులు హైల్త్ బుటిటెన్ ని విడుద‌ల చేయ‌నున్నారు....

బుగ్గనకు నెలాఖరు కష్టాలు.. ఢిల్లీలో నిధుల వేట..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన రాష్ట్రానికి రావాల్సిన నిధుల జాబితా ఇచ్చి వెళ్లిన తర్వాతి రోజునే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో నిధులు...

“పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులు ఎత్తివేత” జీవో నిలుపుదల..!

తెలుగుదేశం పార్టీ హయాంలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై కొంత మంది దాడి చేసి బీభత్సం సృష్టించారు. పోలీసులపై దాడి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ కేసులను ప్రస్తుత ప్రభుత్వం ఎత్తివేస్తూ...

కొడాలి నాని సంయమనం కోల్పోయి ఉండవచ్చు : సజ్జల

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే.. పక్కాగా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది . అందులో డౌట్ లేదు. అందుకే కొడాలి నాని పనిగట్టుకుని అంటున్న మాటలు పై స్థాయి వారికి...

HOT NEWS

[X] Close
[X] Close