చైతన్య : పరిశ్రమ అంటే ఉద్యోగాలేనా..?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయబారుల సదస్సులో… స్థానికులకు ఉద్యోగాల అంశాన్ని ప్రస్తావించారు. అమెరికాలో కూడా స్థానికులకు ఉద్యోగాల అంశంపై చర్చ జరుగుతోందన్నారు. అలా 75 శాతం ఉద్యోగాలిస్తేనే పరిశ్రమలు పెట్టాలని పరోక్షంగా తేల్చి చెప్పారు. కానీ ఓ సీఎం.. ఇలా వ్యాఖ్యానించడం.. అక్కడున్న వారందర్నీ ఆశ్చర్య పరిచింది. ఓ పరిశ్రమ వల్ల వచ్చే ప్రయోజనాలను… ఉద్యోగాలతో మాత్రమే.. ఎందుకు కొలుస్తున్నారన్న చర్చ.. విస్తృతంగా జరుగుతోంది.

పారిశ్రామికీకరణ జరిగిన రాష్ట్రాల్లో చట్టాలెందుకు లేవు..?

తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో … ప్రైవేటుగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకే కచ్చితంగా అవకాశాలు కల్పించాలన్న చట్టాలు లేవు. ప్రభుత్వ పరంగా భూమి ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మాత్రం.. కొన్ని నిబంధనలు పెట్టుకుంటారు. అవి.. పరిశ్రమ.. పరిశ్రమకు మారుతూంటాయి. కానీ చట్టాల ఆలోచనలు చేయలేదు. కారణం… ప్రైవేటు పరిశ్రమల్లో ఉద్యోగం అంటే నైపుణ్యం ఉండి తీరాలి. ఆ నైపుణ్యం.. పరిశ్రమ పెట్టే చోట దొరకడం అసాధ్యం. ఉదాహరణకు.. కియా లాంటి భారీ పరిశ్రమ పెనుకొండ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆటోమోబైల్ ఇంజినీర్లు ఈ పరిశ్రమకు అత్యధికంగా కావాలి. ఎంత మంది అనంతపురం జిల్లాలో దొరుకుతారు..? వారికి కావాల్సిన సీనియార్టీ ఉన్న ఉద్యోగులు అనంతపురంలో ఎక్కడ లభిస్తారు..?.

నైపుణ్యం ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరితే వచ్చేస్తుందా..?

ఈ నైపుణ్యాలు కావాలంటే.. కావాల్సిన చోట నుంచి ఉద్యోగుల్ని తెచ్చుకునే వెసులుబాటు ఉంటేనే పెట్టుబడులకు ఆసక్తి చూపుతారని..పారిశ్రామిక వర్గాలు చెబుతూ ఉంటాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్ వాళ్లపై కియాకు ప్రత్యేకమైన అభిమానం ఏమీ ఉండదు. వారికి కావాల్సింది నైపుణ్యం ఉన్న ఉద్యోగులు.. వారికి ఎలాంటి నిపుణులు కావాలో ముదుగా చెబితే.. రెడీ చేస్తామని సీఎం చెప్పుకొచ్చారు. ఈ మాట వింటే.. చాలా మందికి నవ్వు వస్తుంది. నిపుణులు… తయారయ్యేంతగా… ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీలు మెరుగుపడలేదు. ఎంత మంది డిగ్రీలతో బయటకు వస్తున్నారు.. ఎంత మంది… స్కిల్స్ సంపాదించుకుంటున్నారో లెక్కలు తీస్తే తేలిపోతుంది.

పరిశ్రమ పెడితే ఉద్యోగాలే వస్తాయా..? ఇంకేం రావా..?

పరిశ్రమ పెట్టేటప్పుడు..వచ్చే ప్రయోజనాలను ఉద్యోగ అవకాశాలతో కొలవడం కూడా… అసంబద్ధం. ఎందుకంటే.. ఓ పరిశ్రమ వస్తే..దానికి అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమ చుట్టూ… ఇతర వ్యాపారాలు ఏర్పడతాయి. అది పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి చూపిస్తుంది. ఇలాంటివాటిలో… వంద శాతం స్థానికులకే అవకాశాలు లభిస్తాయి. లోకల్‌గా వారికి ఉన్న అడ్వాంటేజే కారణం. ఇక ఆ పరిశ్రమ వల్ల ఆ ఏరియాలో పెరిగే వ్యాపారం.. రియల్ ఎస్టేట్..దీనికి అదనం. ఇవన్నీ.. ఓ పరిశ్రమ వస్తే కలిగే ప్రయోజనాలు. స్థానిక అభివృద్ధి ..ఆ పరిశ్రమ వల్లే సాధ్యమవుతున్నప్పుడు… ఉద్యోగాల 75 శాతం ఇవ్వాలని చట్టం తేవడం సమంజసం కాదు.

ఇతర రాష్ట్రాలు రాయితీలు ఇచ్చి మరీ ఎందుకు ఆహ్వానిస్తున్నాయి..?

ఒక్క పరిశ్రమ వస్తే ఎంత ఉపయోగం ఉంటుందో.. తెలుసు కాబట్టి.. ఇతర రాష్ట్రాలు ప్రైవేటు పరిశ్రమలపై ఎలాంటి ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేయవు. పైగా.. భారీగా రాయితీలు ఇచ్చి మరీ… తమ తమ రాష్ట్రాలకు ఆహ్వానిస్తూ ఉంటాయి. కియా పరిశ్రమను.. అప్పటి సర్కార్ ఏపీకి తీసుకు రావడానికి చాలా పోటీ ఎదుర్కొంది. మౌలిక సదుపాయాలు, ఇతర రాయితీలను కూడా కల్పించింది. అందుకే కియా ఆసక్తి చూపించింది. భారీ పరిశ్రమలంటే.. సహజంగానే… వాటిపై రాజకీయ ఒత్తిడి ఉంటుంది. కానీ ప్రభుత్వాలు.. ఇలాంటి వాటికి అతీతంగా పారిశ్రామికీకరణ జరగాలని కోరుకుంటాయి. అందుకే.. ఎలాంటి రూల్స్ లేని సెజ్‌లకు రూపకల్పన చేశారు. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో గిఫ్ట్ సిటీల్లాంటివి కట్టి.. నో రూల్స్ ఆఫర్లు ఇస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close